Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు.. అనుకున్న పనులన్ని పూర్తవుతాయి!

ధన స్థానంలో ఉన్న బుధ, రవుల కారణంగా, ఆర్థికంగా ఆశించిన మేరకు కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు..

Horoscope Today: ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు.. అనుకున్న పనులన్ని పూర్తవుతాయి!
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 26, 2023 | 7:44 AM

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, శనులు కొన్ని శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. అదృష్ట యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయం చేస్తారు. ఇతరు లకు మేలు జరిగే పనులు చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరి స్థితి మెరుగ్గా ఉంటుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలోకి వస్తారు. అను కున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో శుభ వార్తలు అందుకుం టారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, శుక్ర, రవి, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అధికారులతో సామ రస్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యా ర్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుక్ర, రవి, కుజ గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సప్తమ శని కారణంగా తప్పకుండా పనిభారం ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి కూడా తప్పకపోవచ్చు. చిన్ననాటి మిత్రుల నుంచి సహకారంతో ప్రధానమైన కార్యకలాపాలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ప్రస్తుతం ధన స్థానం బలంగా ఉన్నందువల్ల ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో వేగం పుంజుకుంటాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగు తుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తున్న కారణంగా వృత్తి, ఉద్యోగాలపరంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. నిరు ద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ధన స్థానంలో ఉన్న బుధ, రవుల కారణంగా, ఆర్థికంగా ఆశించిన మేరకు కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గురు, బుధ, రవుల అనుకూలత కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. బాగా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. వ్యాపారంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్ర, శని, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం కూడా తగ్గి, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపో తాయి.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): లాభస్థానంలో ఉన్న రవి, బుధుల కారణంగా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. పిల్లలు, బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు లేదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):

బుధ, రవులు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు పరి ష్కారం అవుతాయి. అనేక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆక స్మిక మార్పులు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదుతుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే