Mutton Bone Soup: చలికాలంలో హాట్ హాట్ స్పైసీ సూప్‌తో మజా చేయండి.. పాయా రెసిపీ మీకోసం

ఇటీవలే ఈ వంటకం బాగా పాపులర్ అయినా.. ఇది చాలా పురాతన కాలం నాటి వంటకమే.. అప్ప‌ట్లో జ‌లుబు, గొంతు నొప్పి, కాళ్లుచేతులు విరిగిన వాళ్లకు పాయా తాగ‌మ‌ని పెద్ద‌లు స‌ల‌హా ఇచ్చేవారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కీళ్ల నొప్పులున్నవారికి దీనిని తినే ఆహారంలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు కూడా.. ఈ రోజు ఇంట్లోనే టేస్టీ స్పైసీ సూప్‌ పాయా రెసిపీ మీకోసం

Mutton Bone Soup: చలికాలంలో హాట్ హాట్ స్పైసీ సూప్‌తో మజా చేయండి.. పాయా రెసిపీ మీకోసం
Mutton Bones Soup
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Surya Kala

Updated on: Dec 26, 2023 | 8:55 AM

చల్లటి గాలుల్లో కొంచెం వెచ్చగా, ఇంకొంచెం హాయిని ఇచ్చేవి ఏమిటా అని ఆలోచించకుండా ఉండలేము. చలి, వర్షా కాలాలు వచ్చాయంటే చాలు నోరూరించే వేడి వేడి పాయాను టేస్ట్ చేయాల్సిందే అంటారు హైదరాబాదీలు. పాయ అంటే హైద‌రాబాదీల‌కు ఎంతిష్ట‌మో చెప్ప‌క్క‌ర్లేదు. పొద్దున్నే పాయా-బ‌న్ కాంబినేష‌న్ ఇక్క‌డ చాలా ఫేమ‌స్‌. చాలా కేఫ్‌ల్లో దొరుకుతుంది. ఎనిమిది గంట‌ల క‌ల్లా అయిపోతుంది కూడా. తెలంగాణ‌లో కాళ్ల షోర్వా అంటే ప‌డి చ‌స్తారు. దీని కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించడానికి కూడా వెనుకాడడం లేదు పాయా ప్రియుళ్లు.

పాయాను ఎలా తయారు చేస్తారంటే

సాధార‌ణంగా మేక లేదా గొర్రె ముంగాళ్ల ముక్క‌ల‌తో త‌యారుచేసే పులుసే ఈ పాయా లేదా కాళ్ల షోర్వా. కొంత‌ మంది కోళ్లు, బీఫ్ ఎముక‌ల‌ను కూడ వాడ‌తారు. ఎక్కువ‌గా మ‌ట‌న్ పాయ‌నే బాగా ప్రాచుర్యం పొందింది. చాలా వరకు పాయాను పొట్టేలు, మేక కాళ్లతో తయారు చేస్తారు.

కావలిసిన పదార్ధాలు

  1. మేక కాళ్లు
  2. గోధుమ పిండి
  3. ఇవి కూడా చదవండి
  4. దాల్చిన చెక్క
  5. యాలకులు
  6. లవంగాలు
  7. మిరియాలు
  8. సొంటి
  9. కొబ్బరి
  10. మసాలా దినుసులు
  11. నీరు
  12. కారం
  13. ఉప్పు
  14. పసుపు

తయారీ విధానం: ముందుగా మేక కాళ్లను తీసుకుని వాటిని నీటితో కడిగి వాటిని నిప్పుల మీద కాల్చి గోధుమ పిండి సహాయంతో వాటిమీద ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. తర్వాతా శుభ్రంగా కడుగుతారు. ఒక పాత్రలో కాళ్లను, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, సొంటి, కొబ్బరి, ఇతర మసాల దినులు వేసి నీళ్లు పోసి రెండు, మూడు గంటల పాటు మరిగిస్తారు. అనంతరం ఆ సూప్ లో కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేస్తారు. మళ్ళీ సూప్‌ ని చిక్కబడే వరకూ తక్కువ మంట మీద మరిగిస్తారు. దీంతో ఘుమఘుమలాడే పాయా సిద్ధమవుతుంది.

శ్రమ అధికం.. టెస్ట్ కూడా అధికమే

పాయా తయారీ శ్రమతో కూడుకున్న పనే.. అయితే  దీనికున్న రుచి మరే నాన్‌వెజ్‌ వంటకానికి రాదని చెబుతున్నారు తయారీ దారులు. పాయా హోటళ్లలో చాలా అరుదుగా లభిస్తుంది. దీనిని రుచిగా తయారు చేయాలంటే వంటలు చేయడంలో అనుభవం ఉండాలి. అన్ని మసాలాలు కలిసి రుచిగా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

పాయాతో ఎంత ఆరోగ్యమో!

ఇటీవలే ఈ వంటకం బాగా పాపులర్ అయినా.. ఇది చాలా పురాతన కాలం నాటి వంటకమే.. అప్ప‌ట్లో జ‌లుబు, గొంతు నొప్పి, కాళ్లుచేతులు విరిగిన వాళ్లకు పాయా తాగ‌మ‌ని పెద్ద‌లు స‌ల‌హా ఇచ్చేవారు. ఇదే విషయాన్నీ ఇప్పుడు పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కీళ్ల నొప్పులున్నవారికి దీనిని తినే ఆహారంలో చేర్చుకోమని సలహా ఇస్తున్నారు కూడా.. పాయాలో కొలాజెన్ అనే ప్రొటీన్ విరివిగా ఉంటుంది. ఇది చ‌ర్మ‌ సౌంద‌ర్యాన్ని పెంచి పోషిస్తుంది. వివిధ ర‌కాలైన ఖ‌నిజాలు నొప్పి నివార‌ణ‌కు, గాయాలు తొంద‌ర‌గా మాన‌డానికి, ఎముక‌ల‌కు బ‌లాన్నివ్వ‌డానికి ప‌నికి వ‌స్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే