టొమాటోతో ముఖంపై 1 నిమిషం పాటు రుద్దిన తర్వాత, చేతులతో మసాజ్ చేసుకోవాలి. సుమారు 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత తడి గుడ్డతో ముఖాన్ని తుడుచుకోవాలి. టమోటాలో మిగిలిన సగం పై తొక్క తొలగించి, దాని రసాన్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో 2 స్పూన్ల టమోటా రసం తీసుకుని, దానిలో 1 చెంచా శనగపిండి, 1 చెంచా బియ్యం పిండి కలుపుకోవాలి. అందులో 1 చెంచా నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఒక స్పూన్ సోర్ క్రీం వేసి.. ఈ మిశ్రమం చర్మానికి అప్లై చేసుకోవాలి.