- Telugu News Photo Gallery Hot Drinks for Weight Loss: 5 Hot Drinks That Can Help Lose Weight And Burn Calories In Winter
Hot Drinks for Weight Loss: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ హాట్ డ్రింక్స్ తాగారంటే చెడు కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది..
చలికాలం వచ్చిందంటే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇక ఇప్పుడు పండుగల సీజన్ కావడంతో రొటీన్‌కు అతీతంగా తినడం, తాగడం జరుగుతోంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. పండుగల సమయంలో మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వేడి పానీయాలు తాగాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కేలరీలను కూడా సులభంగా బర్న్ చేస్తుంది. ఏ యే డ్రింక్స్ తాగాలంటే.. ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగవచ్చు. ఈ పానీయంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది..
Updated on: Dec 26, 2023 | 12:00 PM

చలికాలం వచ్చిందంటే క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇక ఇప్పుడు పండుగల సీజన్ కావడంతో రొటీన్‌కు అతీతంగా తినడం, తాగడం జరుగుతోంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. పండుగల సమయంలో మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి వేడి పానీయాలు తాగాలి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. కేలరీలను కూడా సులభంగా బర్న్ చేస్తుంది. ఏ యే డ్రింక్స్ తాగాలంటే..

ఒక గ్లాసు వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగవచ్చు. ఈ పానీయంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కడుపుని శుభ్రపరుస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అన్ని కాలుష్యాలను బయటకు పంపుతుంది.

చలికాలంలో వెచ్చగా ఉండటానికి, బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగొచ్చు. గ్రీన్ టీలో ఉండే ఎంజైమ్‌లు, కెఫిన్ కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి. ఈ టీ జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ముందు రోజు రాత్రి ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా సోపును నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం తాగాలి. ఈ నీరు శరీరానికి విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. సోపు నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది.

మధుమేహంతో బాధపడేవారు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగవచ్చు. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి.





























