AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Health Tips: శీతాకాలంలో బరువు పెరుగుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

ఈ వింటర్ సీజన్లో మరీ ముఖ్యమైంది మనం తీసుకునే ఆహారం. షుగర్ , కొవ్వు ఎక్కువ మోతాదు కలిగిన పదార్థాలు, డీప్ ఫ్రై వంటి ఆహారాలను పక్కకు పెట్టి.. తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి నటువంటి పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. దీనివలన బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యమైన ఆహార పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. కనుక తినే తిండి పదార్థాల విషయంలో ఈ చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు.

Winter Health Tips: శీతాకాలంలో బరువు పెరుగుతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
Winter Health Tips
Peddaprolu Jyothi
| Edited By: Surya Kala|

Updated on: Dec 15, 2023 | 4:54 PM

Share

శీతాకాలంలో సహజంగా చాలా మంది బరువు పెరుగుతూ ఉంటారు. దీంతో తమ బరువును తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చలికాలంలో శరీరం సహజంగా అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నటువంటి ఆహారాలను కోరుకుంటుంది. దానికి తోడు ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండడం వలన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్ సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ అనే పరిస్థితికి దారితీస్తుంది. అదృష్టవశాత్తు కొన్ని చర్యలు తీసుకోవడం వలన దీని నివారించడానికి సహాయపడుతుంది. కనుక శీతాకాలంలో బరువుని ఏవిధంగా తగ్గించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

చలికాలంలో కూడా వాకింగ్ లేదా జాగింగ్ లాంటి వ్యాయామాలు చేయాలి. ఈ చర్యలు జీవితంలో భాగమై ఉండాలి. యోగ  చేయాలనుకుంటే బయటకు వెళ్ళడానికి వీలు లేకపోతే.. ఇంట్లోనే ఉండి యోగ చేస్తున్నటువంటి వీడియోలను చూసి అయినా వ్యాయామం చేయాలి. దీని వలన శరీరంలో ఉన్నటువంటి కండరాలు కదిలి ఉత్సాహాన్నిస్తాయి. పనులు చాలా చురుగ్గా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ఈ వింటర్ సీజన్లో మరీ ముఖ్యమైంది మనం తీసుకునే ఆహారం. షుగర్ , కొవ్వు ఎక్కువ మోతాదు కలిగిన పదార్థాలు, డీప్ ఫ్రై వంటి ఆహారాలను పక్కకు పెట్టి.. తాజా కూరగాయలు, పండ్లు, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి నటువంటి పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. దీనివలన బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యమైన ఆహార పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. కనుక తినే తిండి పదార్థాల విషయంలో ఈ చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెబుతున్నారు. తినే సమయంలో తిండి పై దృష్టి పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు వైద్యులు. మొబైల్ ఫోన్స్ , టీవీ చూస్తూ తినడం వలన ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన తినే సమయంలో ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి. తినేటటువంటి  తిండి శరీరాన్ని కి బలం చేకురేలా ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఈ చలి కాలంలో దాహం వేయనప్పటికీ రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చల్లని వాతావరణంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి హెర్బల్ టీ లేదా వెచ్చని నిమ్మకాయ నీరు వంటి వెచ్చని పానీయాలను ఎంచుకోండి. సరైన ఆర్ద్రీకరణ జీర్ణక్రియలో సహాయపడుతుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మానికి మద్దతు ఇస్తుంది.  శారీరక పనితీరును మెరుగుపరుస్తుంది.

అంతేకాదు నిద్రను కూడా ప్రశాంతంగా నిద్ర పోవాలి.. రాత్రి 7:00 నుండి 9 గంటల ప్రాంతంలో పడుకునే విధంగా టైమును కేటాయించుకోవాలి. ఆ సమయంలో పడుకుంటే తగినంత నిద్రతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటుంది. దీని వలన ఎలాంటి ఒత్తిడి సమస్యలకు లోనవ్వకుండా ప్రశాంతంగా ఉండవచ్చు.. మద్యం తదితర వాటిని తగ్గించుకుంటే ఈ సీజన్లో బరువు పెరగకుండా ఉంటారు. అనారోగ్య సమస్యలు దరిచేరవు. వింటర్ సీజన్ లో ఈ టిప్స్ పాటిస్తే బరువు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..