Heart Attack: ఈ 4 అలవాట్లకు దూరంగా ఉండండి.. చిన్న వయసులో గుండెపోటు ముప్పు తప్పించుకోండి..
రోజు రోజుకీ గుండెపోటు ముప్పు వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా పెరుగుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గుండెపోటును నివారించాలనుకుంటే.. సరైన జీవనశైలిని అనుసరించడం ముఖ్యం. చిన్న వయసులోనే గుండె పోటుతో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని గుండె జబ్బుల నిపుణుడు నారాయణ హెల్త్ డా.బిజయ్ కుమార్ మహాల అన్నారు. దీన్ని నివారించడానికి వారానికి 150 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయండి.

మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే.. సరైన జీవనశైలితో పాటు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. గత కొన్నేళ్లుగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా హృద్రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ రోజు ఒక సినిమా షూటింగ్ సమయంలో నటుడు శ్రేయాస్ తల్పాడేకు కూడా గుండెపోటు వచ్చింది. 47 ఏళ్ల నటుడు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇంతకు ముందు కూడా సుస్మితా సేన్, సైఫ్ అలీఖాన్ వంటి బడా నటులు కూడా గుండెపోటుకు గురయ్యారు.
రోజు రోజుకీ గుండెపోటు ముప్పు వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా పెరుగుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం గుండెపోటును నివారించాలనుకుంటే.. సరైన జీవనశైలిని అనుసరించడం ముఖ్యం. చిన్న వయసులోనే గుండె పోటుతో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతున్నారని గుండె జబ్బుల నిపుణుడు నారాయణ హెల్త్ డా.బిజయ్ కుమార్ మహాల అన్నారు. దీన్ని నివారించడానికి వారానికి 150 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయండి. అంతే కాదు జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్చుకోవడం ద్వారా ఈ ప్రమాదకరమైన వ్యాధి ప్రభావం తగ్గుతుంది. యువత కొన్ని రకాల ఆహారాన్ని తినకుండా ఉండాలని ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌లోని డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ యోగితా గోరాడియా చెప్పారు.
ధూమపానానికి దూరంగా ఉండండి
ధూమపానం కూడా గుండెపై చెడు ప్రభావం చూపుతుంది. బీడీలు, సిగరెట్లు, ఇతర ధూమపాన వస్తువుల నుండి వచ్చే పొగ గుండెకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. రోజూ ఎక్కువ సార్లు ధూమపానం చేసేవారిలో గుండె పోటు ప్రమాదం పెరుగుతుంది. కనుక ధూమపానం అలవాటుకు దూరంగా ఉండాలి.
కూల్ డ్రింక్స్
ఎక్కువ చక్కెర, జంక్ ఫుడ్ గుండెకు కూడా ప్రమాదకరం. వీటి వల్ల కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ పెరిగే ప్రమాదం ఉంది. కనుక కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి. అంతేకాదు రెగ్యులర్ గా ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోండి.
ఒత్తిడికి దూరంగా
నేటి కాలంలో చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని డాక్టర్ బిజయ్ చెప్పారు. క్రమంగా అది ఆందోళనగా, డిప్రెషన్‌గా మారుతుంది. ఈ కారణంగా గుండెపోటు ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. ప్రజలు తమ ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
నిద్ర పోయే సమయం..
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి.. శారీరకంగా సాధ్యమైనంత చురుకుగా ఉండండి. గంటల తరబడి ఒకే చోట కూర్చో వద్దు. అంతేకాదు సమయానికి నిద్రపోవడం, మేల్కొవడం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజూ కనీసం 7-8 గంటల పాటు తగినంత నిద్ర పోవాలి.
,మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








