హైదరాబాద్‌లో సరికొత్త ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు.. ఇంతకి ఈ కళాకారుడు విజిత్ పిళ్లై ఎవరు?
విజిత్ పిళ్లై మంచి గుర్తింపు పొందిన కళాకారుడు. న్యూ మీడియా, డిజిటల్ ఆర్ట్‌లో మార్గదర్శకుడు. ఇప్పటికే హైదరాబాద్, బెంగుళూరు ఢిల్లీ, ఫుజైరా, యూఎస్ఏలలో విజయవంతమైన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయనకు చెందిన 750కి పైగా మాస్టర్ పీసెస్ ను మన దేశంతో పాటు, USA, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, మలేసియాతో సహా ఎన్నోచోట్ల కళాప్రియులు కొనుగోలు చేశారు. ఇతర దేశాల వారూ ఎంతో ఆనందంగా వాటిని ..
వాటిని ఒక్కసారి చూస్తే చాలు.. మీ కళ్లు కాంతివంతమవుతాయి. మీ పెదాలపై చిరునవ్వు మెరుస్తుంది. అరుదైన దానిని చూశానన్న తృప్తి మీ మనసుకు కలుగుతుంది. అంతులేని ఆనందం.. అనిర్విచనీయమైన అనుభూతిని మీరు సొంతం చేసుకుంటారు. ఆ కళాఖండాల గొప్పదనం అలాంటిది. ఒక్కో ఆర్ట్ ది ఒక్కో నేపథ్యం. వీటిలో దేనికదే మాస్టర్ పీస్. అలాంటి అరుదైన ఆర్ట్స్ అన్ని కలిసి ఒకే చోట కొలువుదీరితే ఎలా ఉంటుంది? ఆ కలను నెరవేర్చింది.. కళకు అరుదైన గౌరవాన్ని తీసుకువచ్చింది.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సబ్‌లైమ్ గ్యాలెరియా. ఈ గ్యాలరీలో ఉన్న ఒక్కో కళాఖండం వెనుక ఒక్కో కథ ఉంది. తరచి చూస్తే అది అర్థమవుతుంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో సరికొత్త ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటయ్యింది. సబ్‌లైమ్ గ్యాలెరియా (Sublime Galleria)ను ప్రముఖ కళాకారుడు విజిత్ పిళ్లై ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఫినాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో శుక్రవారం (డిసెంబరు 15)నాడు దీన్ని ప్రారంభించారు. కళా ప్రియుల అభిరుచులకు తగిన మేరకు విభిన్న రకాల అద్భుత కళాఖండాలను ఈ గ్యాలరీలో అందుబాటులో ఉంచారు. హైదరాబాదీల చెంతకే అరుదైన కళాఖండాలను తీసుకువచ్చారు. ఆర్ట్స్ పట్ల మంచి అభిరుచి కలిగిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వాటిని కొనుగోలు చేయాలనుకునే ఔత్సాహికుల మార్కెట్ కూడా హైదరాబాద్‌లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో కళాకారులు, కళా ప్రియుల మధ్య వారధిగా తమ గ్యాలరీ నిలుస్తుందని నిర్వాహకులు ఎంతో సంతోషంగా చెప్పారు.
నచ్చిన ఆర్ట్ కోసం ఎంతకాలమైన వేచి చూస్తారు కొందరు. ఎంత దూరమైన వెళ్లడానికి వెనుకాడరు కొందరు. కారణం.. ఆ ఆర్ట్ పై వారికి ఉన్న ప్రేమ అలాంటిది. కానీ ఒక్కోసారి సమయం దొరకక.. వేరే ప్రాంతాల్లో తమకు ఇష్టమైన ఆర్ట్స్ ఉన్నాయని తెలిసినా సరే అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అదే.. వాటిని తమ చెంతకే తీసుకువచ్చి.. తమ ప్రాంతంలోనే ప్రదర్శన ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అవును.. విజిత్ పిళ్లై అదే చేశారు. కళా ప్రియులు తమకు అవసరమైన ఆర్ట్‌ను సొంతం చేసుకునేందుకు సబ్‌లైమ్ గ్యాలెరియా సరైన వేదికగా నిలుస్తుందని విజిత్ పిళ్లై అన్నారు. ఇప్పటికే బెంగుళూరులో సబ్‌లైమ్ గ్యాలెరియా ఉండగా.. ఇప్పుడు రెండో గ్యాలరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళలను, కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే దీన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో భాగ్యనగరంలోని కళాకారులకు, కళాప్రియులకు మంచి వేదిక లభించినట్లు అయింది.
విజిత్ పిళ్లై మంచి గుర్తింపు పొందిన కళాకారుడు:
విజిత్ పిళ్లై మంచి గుర్తింపు పొందిన కళాకారుడు. న్యూ మీడియా, డిజిటల్ ఆర్ట్‌లో మార్గదర్శకుడు. ఇప్పటికే హైదరాబాద్, బెంగుళూరు ఢిల్లీ, ఫుజైరా, యూఎస్ఏలలో విజయవంతమైన ప్రదర్శనలు నిర్వహించారు. ఆయనకు చెందిన 750కి పైగా మాస్టర్ పీసెస్ ను మన దేశంతో పాటు, USA, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, మలేసియాతో సహా ఎన్నోచోట్ల కళాప్రియులు కొనుగోలు చేశారు. ఇతర దేశాల వారూ ఎంతో ఆనందంగా వాటిని తమ సొంతం చేసుకున్నారు.
విజిత్ పిళ్లై చెందిన 500కు పైగా ఆర్ట్ వర్క్స్ బెంగళూరులోని షెరటాన్ గ్రాండ్, హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా డెకరేషన్ భాగమయ్యాయి. అందుకే అక్కడికి ఎవరు వెళ్లినా వాటిని కన్నార్పకుండా చూస్తారు. ఎందుకంటే అవి వారి మనసుకు అంతగా నచ్చాయి. అందుకే ఆయనకు చెందిన ఆర్ట్స్.. ఎక్కడైనా గ్యాలరీలలో కనిపిస్తే చాలు.. కచ్చితంగా కళాప్రియులంతా వాటిని చూడడానికి వెళ్తుంటారు.
విజిత్ పిళ్లైకు చెందిన లేటెస్ట్ ఎడిషన్ పేరు అమల్గమేషన్. ప్యాండమిక్ సమయంలో ఈ ఆర్ట్ వర్క్స్ కలెక్షన్ ను సిద్ధం చేశారు ఆయన. ఇది పిళ్లై.. ఎక్స్ పేన్సివ్ ఆర్టిస్టిక్ పోర్టిఫోలియో అని చెప్పాలి. అందుకే ఆయన ఆర్ట్స్ చూసినవాళ్లకు ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. ఆ కళాఖండాల్లోని క్రియేటివిటీతోపాటు చరిత్ర, ఎమోషన్ కూడా భాగమై ఉన్నాయని.
విజిత్ పిళ్లై.. ప్రత్యేకమైన ఎడిషన్ కాన్వాస్‌లలో ‘మిక్స్‌డ్ మీడియా ఆర్ట్” శైలిలో తన ఆర్ట్స్ ను సిద్ధం చేస్తారు. కాన్వాస్‌పై యాక్రిలిక్ పెయింట్‌తో అల్లికలు, ఫిల్టర్‌లు, నమూనాలు, అధునాతన డిజిటల్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా కొత్త రూపాన్ని తీసుకువస్తారు. ఆయన చాలా చిన్న వయస్సులోనే పెయింటింగ్ చేయడం ప్రారంభించారు. అతనికి మూడేళ్ల వయసులో తన తల్లి కాన్వాస్, పెయింట్స్ ఇచ్చి ప్రోత్సహించింది. నెహ్రూ యువ కేంద్రం నుండి బెస్ట్ పెయింటింగ్ ఆల్ ఇండియా అవార్డ్, స్కూల్‌లో బెస్ట్ ఆర్టిస్ట్ బహుమతిని గెలుచుకున్నారు. డూన్ స్కూల్‌లో అతని చిత్రకళా ఉపాధ్యాయుడు అయిన రతిన్ మిత్ర స్టూడెంట్ గా ఆయనకు గుర్తింపు ఉంది.
ఆగస్టు 2013లో బెంగుళూరులోని విండ్సర్ మనోర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఆక్షన్ ఆఫ్ మోడరన్ అండ్ కాంటెంపరరీ ఆర్టిస్ట్స్‌లో MF హుస్సేన్, ఎఫ్‌ఎన్ సౌజా వంటి మాస్టర్స్‌తో కలిసి ఆయన కళాఖండాలను ప్రదర్శించారు. ఆయన రెడీ చేసిన 3 కళాకృతులలో అన్నీ ఎక్కువ ధరకు కళాప్రియులు సొంతం చేసుకున్నారు. ఈ కళాఖండాలు ఒక బిల్డింగ్ ధర కంటే ఎక్కువ రేటుకే అమ్ముడుపోవడం గమనార్హం. విజిత్ పిళ్లై చిత్రాలు లక్షలాది రూపాయలు ధర పలుకుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆయన ఆర్ట్స్ ఎంతగా అందరికీ నచ్చాయో!
Gunnesh UV, TV9 Executive Editor