AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Seethakka: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే.. అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీతక్క

అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తన మార్క్ పాలన చూపిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అడుగులు వేస్తోంది. తాజా మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం పెట్టారు సీతక్క.

Minister Seethakka: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే.. అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీతక్క
Minister Seethakka
Balaraju Goud
|

Updated on: Dec 15, 2023 | 2:54 PM

Share

అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తన మార్క్ పాలన చూపిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అడుగులు వేస్తోంది. తాజా మంత్రి సీతక్క తీసుకున్న నిర్ణయంతో అంగన్వాడీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ధనసరి అనసూయ అలియాస్ సీతక్క బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్‌లో వేద మంత్రోచ్ఛరణాల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అంగన్వాడీలకు సంబంధించిన ఫైల్ మీద మంత్రిగా తొలి సంతకం పెట్టారు సీతక్క.

ఈ మేరకు ఆమె అంగన్వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం రూపొందించిన ఫైలుపై మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు. ఆమె నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి..

మరోవైపు అంగన్వాడీ టీచర్లకు కూడా మంత్రి సీతక్క తీపి కబురు అందించారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్‌ మీద కూడా సీతక్క సంతకం పెట్టారు. దీంతో ఇప్పటివరకు రూ.7,500 జీతం అందుకున్న అంగన్వాడీ టీచర్లు.. ఇక నుంచి రూ.13,500 జీతం అందుకోనున్నారు. మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుంటే అయితే ప్రజాభవన్‌లో శుక్రవారం ఉదయం నుండి ప్రజా దర్బార్‌ కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదులు ఇచ్చేందుకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్‌ వద్ద తమ వంతు కోసం అరకిలోమీటర్‌ మేర దరఖాస్తుదారులు లైన్లలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవడంతో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…