AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rega Kantharao: సొంత పార్టీ నాయకులే ఓడగొట్టారు.. కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆవేదన

శాసనసభ ఎన్నికల్లో పినపాక ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. అయితే సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంతారావు. పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సొంత పార్టీ నాయకుల కారణంగానే ఓటమిపాలయ్యమంటూ మాజీ ఎమ్మెల్యే కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు.

Rega Kantharao: సొంత పార్టీ నాయకులే ఓడగొట్టారు.. కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆవేదన
Rega Kantha Rao
Balaraju Goud
|

Updated on: Dec 15, 2023 | 4:14 PM

Share

శాసనసభ ఎన్నికల్లో పినపాక ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. అయితే సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంతారావు. పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సొంత పార్టీ నాయకుల కారణంగానే ఓటమిపాలయ్యమంటూ మాజీ ఎమ్మెల్యే కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల కాలంలో పోడు భూముల సమస్యలు పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశానని గుర్తుచేశారు. పోడు భూముల పట్టాల కోసం, అభివృద్ధి కోసమే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి మారానని చెప్పుకొచ్చారు కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవ జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నాయకులను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో నాయకుల తప్పిదాల వల్లే ఓడిపోయామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు నాయకులు మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్దాం అంటూ మాట్లాడుతుండడం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే వెళ్ళిపోతే మంచిదని వ్యాఖ్యానించారు.

తాను ఇప్పటికే ఒకసారి పార్టీ మారి తప్పు చేశానని, మళ్లీ అలాంటి తప్పు చేయబోతున్నాననీ స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ తోనే ప్రయాణం సాగిస్తానని అన్నారు పార్టీ కోసం పనిచేసే మహిళల పట్ల కొందరు నాయకులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. మళ్లీ అలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ కంటికి కనబడడు అంటూ హెచ్చరించారు రేగా కాంతారావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…