Travel India: భారతదేశంలోని ఈ ప్రదేశాలు ఉత్తమ హనీమూన్ గమ్యస్థానాలు.. మధురమైన జ్ఞాపకాలను ఇస్తాయి

దంపతులు విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. అయితే మీరు సరిగ్గా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను చూస్తే విదేశీ దేశాలకు వెళ్లాలన్న కోరికను మరచిపోతారు. భారతదేశంలో అలాంటి అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తే.. మళ్ళీ తిరిగి రావాలని ఎవరూ అనుకోరు. ఈ రోజు దంపతులు వెళ్ళడానికి హనీమూన్‌కు ఉత్తమమైన ప్రదేశాల గురించి మాట్లాడుతాము.

Travel India: భారతదేశంలోని ఈ ప్రదేశాలు ఉత్తమ హనీమూన్ గమ్యస్థానాలు.. మధురమైన జ్ఞాపకాలను ఇస్తాయి
Honeymoon Astrology
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2023 | 8:14 PM

పెళ్లి తర్వాత ఏ జంటకైనా హనీమూన్ చాలా ప్రత్యేకం. అదే సమయంలో ఈ రోజుల్లో హనీమూన్ కోసం థాయిలాండ్, బ్యాంకాక్ వంటి విదేశాలకు వెళ్లడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఈ దేశాలకు వెళ్లడం  చాలా ఖరీదైనవి. భారతదేశంలో హనీమూన్ కి ఉత్తమమైన అనేక ప్రదేశాలు ఉన్నాయి. అవి బడ్జెట్‌కు కూడా సరిపోతాయి. హనీమూన్ కోసం ఈ ప్రదేశాలకు వెళ్లడం మీకు, మీ భాగస్వామికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి.

దంపతులు విదేశాలకు వెళ్లాలని కలలు కంటారు. అయితే మీరు సరిగ్గా భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను చూస్తే విదేశీ దేశాలకు వెళ్లాలన్న కోరికను మరచిపోతారు. భారతదేశంలో అలాంటి అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తే.. మళ్ళీ తిరిగి రావాలని ఎవరూ అనుకోరు. ఈ రోజు దంపతులు వెళ్ళడానికి హనీమూన్‌కు ఉత్తమమైన ప్రదేశాల గురించి మాట్లాడుతాము.

గోవా: హనీమూన్‌కి ఎవరైనా విదేశాలకు వెళ్లాలనుకుంటే.. మన దేశంలోని గోవా విదేశాన్ని గుర్తు చేస్తూ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. ఇది జంటలకు ఇష్టమైన హాలిడే స్పాట్. బీచ్‌లో మీ భాగస్వామితో కలిసి అందమైన సూర్యాస్తమయాన్ని చూడటం అందమైన కల. దీనితో పాటు మీరు మీ భాగస్వామితో సాహసోపేతమైన కార్యకలాపాలను కూడా ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

కేరళ: వివాహం తర్వాత హనీమూన్ ప్లాన్ చేస్తుంటే ఉత్తమ పర్యాటక ప్రాంతాల జాబితాలో కేరళను చేర్చండి. మీ జీవిత భాగస్వామితో ఇక్కడ గడిపిన ప్రతి క్షణం మీ జీవిత కాలానికి గుర్తుండిపోతుంది. సహజ దృశ్యాలతో పాటు మీ హనీమూన్ జర్నీని ప్రత్యేకంగా తీర్చిదిద్దే వేద స్పా, ట్రీ హౌస్ సహా ప్రకృతి అందాలు కేరళ సొంతం.

మౌంట్ అబూ: రాజస్థాన్ స్వర్గధామం అని పిలుచుకునే మౌంట్ అబూ అందాలు ఎవరి మనసు నైనా ఉల్లాస పరుస్తాయి. జంటలకు ఈ నగరం ఉత్తమ హనీమూన్ ప్లేస్. నగరం చుట్టూ పచ్చదనం, కొండలు, సరస్సుల అందమైన దృశ్యాలు మీ హనీమూన్‌ను గుర్తుండిపోయేలా చేస్తాయి. మీ భాగస్వామితో చేతులు పట్టుకుని సూర్యాస్తమయం సమయంలో మారుతున్న మేఘాల రంగులను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని ఇస్తాయి.

జమ్మూ కాశ్మీర్: మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని అందమైన లోయలు, అందమైన సరస్సులు, వీటన్నింటి మధ్య మీ భాగస్వామితో గడపడం ఎవరికైనా స్వర్గం అంటే ఇదే అనిపిస్తుంది. అవును భారతదేశ స్వర్గధామం అని జమ్మూ కాశ్మీర్ ని అంటారు అందమైన మంచు కొండల మధ్య హనీమూన్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడకు వచ్చి దాల్ లేక్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..