Sabarimala Temple: రామయ్య భక్తురాలు శబరి పేరుతో ఏర్పడిన శబరిమల.. 800 ఏళ్ల పురాతనమైన ఆలయం విశిష్టత ఏమిటంటే

శివుడు, విష్ణువుల తనయుడు అయ్యప్ప. అందుకే ఈ ఆలయం ప్రాచీనమైన  రామాయణ కాలానికి చెందినది అని ఆలయ చరిత్ర చెబుతోంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తలపై ఇరుముడితో ఆలయానికి చేరుకుంటారు. ఈ ఇడుముడిలో అయ్యప్పకు సమర్పించే వస్తువులు ఉంటాయి.  అయ్యప్పను దర్శించుకుంటే తాము కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.   

Sabarimala Temple: రామయ్య భక్తురాలు శబరి పేరుతో ఏర్పడిన శబరిమల.. 800 ఏళ్ల పురాతనమైన ఆలయం విశిష్టత ఏమిటంటే
Sabarimala Temple
Follow us

|

Updated on: Dec 12, 2023 | 5:54 PM

కేరళలోని శబరిమల ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. అయ్యప్ప ఆలయంలో నెలకొన్న భక్తుల రద్దీ, నిర్వహణ లోపం కారణంగా ఈసారి ఆలయం వార్తల్లో నిలిచింది. హిందువుల పవిత్ర క్షేత్రాల్లో ఒకటి  శబరిమల. శివ కేశవుల తనయుడు అయ్యప్ప దీక్షను చేపట్టే భక్తులు ఏడాది ఏడాదికి పెరిగిపోతున్నారు. అయ్యప్ప దీక్షను చేపట్టి ఆలయానికి చేరుకుంటారు. అందుకే అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏడాది పొడవునా వేలాది మంది ఆలయానికి వెళ్తారు. అయ్యప్ప ఆలయం సుమారు 800 సంవత్సరాల పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. అయ్యప్ప దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని దేశంలోనే అత్యంత ప్రసిద్ధ అయ్యప్ప దేవాలయంగా ఎందుకు పిలుస్తారు? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

హిందూ మతవిశ్వాసం ప్రకారం..

శబరిమల ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉంది. రామాయణ కథలో శబరిమల ఆలయానికి  శబరి పేరుతో ఏర్పడిందని.. శ్రీరాముడు తన భక్తురాలైన శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను తిన్నాడని పురాణాల్లో పేర్కొన్నారు. శివుడు, విష్ణువుల తనయుడు అయ్యప్ప. అందుకే ఈ ఆలయం ప్రాచీనమైన  రామాయణ కాలానికి చెందినది అని ఆలయ చరిత్ర చెబుతోంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తలపై ఇరుముడితో ఆలయానికి చేరుకుంటారు. ఈ ఇడుముడిలో అయ్యప్పకు సమర్పించే వస్తువులు ఉంటాయి.  అయ్యప్పను దర్శించుకుంటే తాము కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

శబరిమల ఆలయానికి ఎలా చేరుకోవాలంటే..?

శబరిమల ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురం నుండి 175 కిలోమీటర్ల దూరంలో శబరిమల కొండలపై ఉంది. శబరిమల ఆలయానికి విమానంలో చేరుకోవాలంటే.. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాలి.  ఇది ఆలయానికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చు..  శబరిమలకు సమీపంలోని రైల్వే స్టేషన్ అయిన చెంగనూర్‌కు చేరుకోవాలి. దేశంలోని ఏ మూల నుండి అయినా శబరిమల ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. శబరిమల ఆలయంలో అయ్యప్పతో పాటు గణేశుడు, నాగదేవత వంటి ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని అందమైన దేవాలయాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మకరవిళక్కు పండుగ అంటే ఏమిటంటే

శబరిమల ఆలయంలో ప్రతి సంవత్సరం మకరవిళక్కు అంటే మండల దీక్ష.. మకర సంక్రాంతిని ఘనంగా  జరుపుతారు. వాస్తవానికి ఏడాది పొడవునా ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. అయితే మండల దీక్ష చేపట్టిన భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు చేరుకుంటారు. దీంతో ఈ పండుగ సందర్భంగా ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామిని కొత్త బట్టలు, నగలతో అలంకరిస్తారు. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేరళ ప్రజలకు మకర  పండుగ ఒక విశిష్టమైన వేడుక. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా మకర సంక్రాంతి వేడుకను జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
సంతోషంగా ఉండాలని ఉందా.? భగవద్గీతలోని ఈ 5 పాటించండి..
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమౌతుందో తెలుసా..? శరీరంలో జరిగే
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
రామ్ చరణ్‏తో సినిమాపై మరోసారి కృష్ణవంశీ కామెంట్స్..
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
మారేడు దళం..రోజూ పరగడుపునే ఒక్కటి తింటే చాలు..డాక్టర్‌ తో పనిలేదు
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.
కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
కీర్తి సురేష్‌ కొత్త సినిమా.. నేరుగా ఓటీటీలో విడుదల, ఎప్పుడంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
బంగారం ప్రియులకు గోల్డెన్‌ న్యూస్‌.. ఆదివారం తులం ధర ఎంతంటే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
రుచి, సువాసనే కాదు ఆరోగ్యం కూడా.. ఉదయాన్నే అల్లం టీ తాగితే..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..