AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా ఇంట్లో కుబేర యంత్రాన్ని ఈ దిశలో ఏర్పాటు చేసి చూడండి

హిందూ మతంలో సంపదను పెంపొందించుకోవడానికి కుబేరుడిని పూజిస్తారు. ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు. కనుక ఉత్తర దిక్కుని కుబేరుని నివాసంగా భావిస్తారు. ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుడి కరుణను పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవు. ఉత్తర దిక్కును కుబేరుడి దిక్కుగా భావిస్తారు. కనుక ఈ దిశను వాస్తు దోషాలు లేకుండా ఉంచడానికి ఇంటి ఉత్తరం వైపు గోడపై కుబేర యంత్రాన్ని అమర్చాలి.

Vastu Tips: ఆర్ధిక ఇబ్బందులా ఇంట్లో కుబేర యంత్రాన్ని ఈ దిశలో ఏర్పాటు చేసి చూడండి
Lord Kubera Yantra
Surya Kala
|

Updated on: Dec 11, 2023 | 4:08 PM

Share

ఎవరైనా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా.. జీవించడానికి సరిపడా డబ్బు లేకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చినా కుబేరుడి యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు కొరత తీరిపోయి క్రమంగా ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అయితే ఇంట్లో కుబేరు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు అయితే దీనికి కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. కుబేర యంత్రాన్ని సరైన దిశలో మాత్రమే ఉంచాలి.  వాస్తు నియమాలను అనుసరించకుండా కుబేర యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రయోజనం లభించదు.

హిందూ మతంలో సంపదను పెంపొందించుకోవడానికి కుబేరుడిని పూజిస్తారు. ఇంటి ఉత్తరం దిక్కుకు అధిపతి కుబేరుడు. కనుక ఉత్తర దిక్కుని కుబేరుని నివాసంగా భావిస్తారు. ఐశ్వర్యానికి దేవుడైన కుబేరుడి కరుణను పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు ఏర్పడవు. ఉత్తర దిక్కును కుబేరుడి దిక్కుగా భావిస్తారు. కనుక ఈ దిశను వాస్తు దోషాలు లేకుండా ఉంచడానికి ఇంటి ఉత్తరం వైపు గోడపై కుబేర యంత్రాన్ని అమర్చాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపు ఎప్పుడూ ఉత్తరం వైపు తెరిచే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. ఆ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మి కుబేరుల ఆశీర్వాదం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కుబేర్ యంత్రాన్ని ఏ దిశలో ఏర్పాటు చేయాలంటే..

ఇంట్లో కుబేర యంత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక కుబేరు యంత్రాన్ని ఆచారాల ప్రకారం పూజించిన తర్వాత ఇంటి ఉత్తర దిశలో మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వలన  కుబేరుడి ఆశీస్సులు ఆ ఇంటి యజమానిపై సదా నిలిచి ఉంటాయి.  ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు ఆగిపోయిన పనులు కూడా క్రమంగా పూర్తి అవ్వడం ప్రారంభమవుతాయి.  జీవితంలోని ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. అందువల్ల కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచే ముందు ఏర్పాటు చేయాల్సిన దిశను గుర్తుంచుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు