AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..

టీ20 ప్రపంచకప్‌లో 18వ మ్యాచ్‌లో భారత్‌ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. భారత్ అందించిన 210 పరుగుల టార్గెట్‌ను చేరుకోలేక పోయిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత జట్టు గ్రూపు ఏలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తదుపరి మ్యాచ్‌లో అంటే, ఫిబ్రవరి 15న పాకిస్తాన్ జట్టుతో తలడనుంది.

IND vs NAM: సత్తా చాటిన బౌలర్లు.. నమీబియాపై భారత్ భారీ విజయం..
Team India
Venkata Chari
|

Updated on: Feb 12, 2026 | 10:33 PM

Share

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన 18వ మ్యాచ్ లో నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. చివరి 4 పరుగులలో భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్ 61, హార్దిక్ పాండ్యా 52 పరుగులు చేశారు. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా, అక్షర్ మరియు హార్దిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. నమీబియా తరఫున లారెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

నమీబియా (ప్లేయింగ్ XI): లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్(కీపర్), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో.