AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 15న ఈషా యోగా సెంటర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. హాజరుకానున్న కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎం!

మహాశివరాత్రి 2026 వేడుకలు కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్ ముస్తాబైంది. ఈ నెల 15న ఈషా యోగా సెంటర్‌లో సద్గురు మార్గదర్శకత్వంలో మహాశివరాత్రి వేడుకలు ఘటనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్రం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి మురుగన్‌ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.

ఈ 15న ఈషా యోగా సెంటర్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. హాజరుకానున్న కేంద్రమంత్రులు, మహారాష్ట్ర సీఎం!
Sadhguru Mahashivratri 2026
Anand T
|

Updated on: Feb 12, 2026 | 8:51 PM

Share

15వ రోజూ రాత్రి ఈ వేడకలు ఘనంగా జరగనున్నాయి రాత్రంతా జరిగే వేడుకలు భక్తి, సంగీతం, ధ్యానం కలిసి భక్తులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్లకు పైగా ప్రేక్షకులు 100కి పైగా టీవీ ఛానెళ్లు, డిజిటల్ స్ట్రీమ్‌ల ద్వారా 23 భారతీయ, విదేశీ భాషల్లో ఈ వేడుకలకు సంబంధించిన లైవ్‌ స్ట్రిమింగ్‌ జరగనుంది.

ఈ వేడుకలు ధ్యానలింగంలో పంచభూత క్రియతో ప్రారంభం కానున్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు మూలకాలను గౌరవించే శక్తివంతమైన శుద్ధీకరణ ఆచారం ఇది. ఆ తర్వాత లింగ భైరవి మహా యాత్ర, దివ్య స్త్రీ శక్తిని జరుపుకునే గొప్ప ఊరేగింపు జరుగుతుంది. అంతేకాదు ఆరోజు రాత్రంతా వివిధ సంగీత ప్రదర్శనలు జరుగుతాయి.

మహాశివరాత్రికి ముందు ఈషా యొక్క ఉత్సాహవంతమైన భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్య ఉత్సవం ఘనంగా జరుగు జరుగుతుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12 సిక్కిల్ గురుచరణ్, 13న రాహుల్ దేశ్‌పాండే సంగీతం, 14న మీనాక్షి శ్రీనివాసన్ భరతనాట్యం ప్రోగ్రామ్స్ జరగనున్నాయి.

ఈ సంవత్సరం మొదటిసారిగా సద్గురు స్వయంగా యోగేశ్వర లింగ మహా అభిషేకం నిర్వహించనున్నారు. ఈ పవిత్ర జీవ శక్తి రూపంతో అనుసంధానం కావడానికి ప్రపంచవ్యాప్త భక్తులకు ఉంచితంగా అవకాశం కల్పించనున్నారు. అలాగే ఈషా యోగా సెంటర్‌లో ఉన్న 112 అడుగుల అదియోగి దివ్య దర్శనం భక్తులకు లభించనుంది. ఈ సందర్భంగా సద్గురు యోగా ఆరంభ కథను వివరించనున్నారు.

ప్రపంచవ్యాప్త ఉన్న శివయ్య భక్తులు ఈషా యోగా సెంటర్‌లో లేదా ఆన్‌లైన్ లైవ్‌స్ట్రీమ్ ద్వారా రాత్రంతా జాగరణ చేయవచ్చు. సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల పాటు సద్గురు యూట్యూబ్ ఛానెల్, ప్రధాన మీడియా నెట్‌వర్క్‌లలో 23 భాషల్లో ఈ లైవ్ స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉండనుంది.

మరిన్ని అథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.