AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturday Puja: శని దోషం ఉన్నవారు శనివారం ఎందుకు పూజిస్తారో తెలుసా.. పురాణాల కథనం ఏమిటంటే..

శనిదేవుని గురువు స్వయంగా మహాదేవుడే. అతని నుండి శనిదేవుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే వరం పొందాడు. మానవుడు తాను చేసే కర్మను అనుససరించి శనీశ్వరుడి ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడి కోపం నుండి రక్షించబడలేరు. శనీశ్వరుడు ఎవరి జాతకంలో బలహీన స్థితిలో ఉంటే    జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఈ కష్టాలన్నీ తొలగిపోవడానికి శనీశ్వరుడిని శనివారం పూజిస్తారు

Saturday Puja: శని దోషం ఉన్నవారు శనివారం ఎందుకు పూజిస్తారో తెలుసా.. పురాణాల కథనం ఏమిటంటే..
Shani Dev
Surya Kala
|

Updated on: Dec 09, 2023 | 7:08 AM

Share

హిందూమతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడింది. శనివారం శనీశ్వరుడికి, కాల భైరవుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. శనీశ్వరుడిను నిర్ణయాత్మక గ్రహం అంటారు.  ఈయన స్వభావం చాలా దూకుడుగా పరిగణించబడుతుంది.  తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. శనీశ్వరుడి పేరు ఎత్తగానే ప్రజల్లో భయం మొదలవుతుంది. శనీశ్వరుడి దృష్టి ఎవరిపైన పడుతుందో వారికి అన్ని రకాల ఆపదలు వస్తాయని, రోగాల బారిన పడతారని, మానసికంగా ఇబ్బందులు కలుగుతాయని నమ్మకం. శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు.

శనీశ్వరుడిని శనివారం పూర్తి ఆచారాలతో పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. శనివారం నాడు భక్తులందరూ శనీశ్వరుడి దేవాలయానికి వెళ్లి శనిదేవుడికి ఆవనూనె లేదా నువ్వుల నూనెను సమర్పిస్తారు. శనిదేవునికి నూనె సమర్పించాలనే నమ్మకం చాలా పురాతనమైనది. దీని వెనుక అనేక పురాణ కథలు ప్రబలంగా ఉన్నాయి.

శనివారం శని పూజ ప్రాముఖ్యత

శనిదేవుని గురువు స్వయంగా మహాదేవుడే. అతని నుండి శనిదేవుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే వరం పొందాడు. మానవుడు తాను చేసే కర్మను అనుససరించి శనీశ్వరుడి ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడి కోపం నుండి రక్షించబడలేరు. శనీశ్వరుడు ఎవరి జాతకంలో బలహీన స్థితిలో ఉంటే    జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఈ కష్టాలన్నీ తొలగిపోవడానికి శనీశ్వరుడిని శనివారం పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

శనివారం ఉపవాసం చేయడం వల్ల ఎవరి జీవితంలోనైనా కీర్తి, సంతోషం, శ్రేయస్సు, శాంతి , అదృష్టం పెరుగుతాయని చెబుతారు. శనివారం నాడు శని దేవుడిని ఆరాధించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.

శనీశ్వరుడి ఎలా జన్మించాడంటే

శనీశ్వరుడి జన్మకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం  సూర్యడు ప్రజాపతి దక్షుడి కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నాడు. సంధ్య సూర్యుడి దంపతులకు యముడు, యమున, మనువులు జన్మించారు. అయితే సంధ్య  తన భర్త సూర్యభగవానుని ప్రతాపాన్ని ఎక్కువ కాలం భరించలేకపోయింది. అటువంటి పరిస్థితిలో సంధ్య సూర్య భగవానుడి సేవ కోసం తన నీడను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఛాయా దేవి శనీశ్వరుడు జన్మించాడు.

శనీశ్వరుడి దర్శనం ఎందుకు అశుభంగా భావిస్తారు?

పురాణాల ప్రకారం సూర్యపుతుడు శనీశ్వరుడు చిత్రరధుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి శనీశ్వరుడు శ్రీ కృష్ణుని ఆరాధిస్తున్నప్పుడు.. అతని భార్య దామిని కోరికతో భర్త వద్దకు వచ్చింది. అప్పుడు శనీశ్వరుడు ఎవరి గురించి పట్టించుకోనంతగా శ్రీకృష్ణుని భక్తిలో మునిగిపోయాడు. శనీశ్వరుడు ధ్యానం నుంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతన్ని ధ్యానం నుండి మేల్కొలపాలనే ప్రయత్నం చేసింది, కానీ ఆమె ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. దీంతో దామినికి కోపం వచ్చి మీరు నన్ను ప్రేమగా చూడలేదు.. దీంతో కోపంతో మిమ్మల్ని ఎవరు చూసినా దురదృష్టం కలుగుతుందని.. మిమ్మల్ని ఎవరు చూసినా కష్టాల బారిన పడతారని శాపం ఇచ్చింది. దీని కారణంగా శని దృష్టి దోషంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు