Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
వార ఫలాలు (డిసెంబర్ 10-16, 2023): మేష రాశి వారికి ఈ వారం నిరుద్యోగులకు కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వోద్యోగులకు బాగా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తయి ఊరట లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
వార ఫలాలు (డిసెంబర్ 10-16, 2023): మేష రాశి వారికి ఈ వారం నిరుద్యోగులకు కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వోద్యోగులకు బాగా అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తయి ఊరట లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహాల అనుకూలత కారణంగా నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందివస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్య మైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవు తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వోద్యోగులకు బాగా అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. సతీమణి నుంచి సహకారం లభిస్తుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ పూర్తయి ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగు తాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటారు. కుటుంబ సభ్యులతోను, తల్లితండ్రులతోను ఉత్సాహంగా గడుపుతారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
మధ్య మధ్య అష్టమ శని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరు గుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడ తాయి. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపా రాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేయడం జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల్ని అదుపు చేస్తారు. కొందరు ఇష్టమైన బంధువు లను కలుసుకుంటారు. ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాల క్షేపం చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో ఊహించని జాప్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే, కొందరు మిత్రుల కారణంగా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తల్లితండ్రుల జోక్యంతో ముఖ్యమైన ఆస్తి వివాదం చాలావరకు పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలను చవి చూస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగపరంగా ఏదో మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి ప్రతిఫలం అందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా బాగా ఒత్తిడికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెంచడం జరుగుతుంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధువులకు సంబంధించిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. మిత్రుల కార ణంగా కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. సతీమణితో అన్యోన్యత బాగా పెరుగుతుంది.