Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunday Puja Tips: ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ 12 నామాలు పఠించి చూడండి.. ఆరోగ్యం మీ సొంతం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని పూజించడానికి రాగి అత్యుత్తమని.. కనుక రాగి పాత్రను  ఉపయోగించాలని చెప్పారు. రాగి పాత్రను తీసుకుని అందులో నీటిని పోసి చందనం, కుంకుమ, అక్షతలు వేసి ఎరుపు రంగు పూలు సమర్పించాలి. దీపం, రాగి పాత్రను ఒక ప్లేట్‌లో ఉంచండి. రాగి పాత్రలో నీరుని "ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించండి. సూర్య భగవానుడికి అర్ఘ్య సమర్పణ చేస్తున్నప్పుడు..  రెండు చేతులను పైకి ఎత్తండి.. సూర్యుని బింబాన్ని దర్శిస్తూ ఈ 12 మంత్రాలను జపించండి.

Sunday Puja Tips: ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ 12 నామాలు పఠించి చూడండి.. ఆరోగ్యం మీ సొంతం..
Sunday Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2023 | 6:44 AM

హిందూ మతంలో ఆదివారం గ్రహాల రాజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నియమ నిష్ఠల ప్రకారం సూర్య భగవానుని పూజించడం ద్వారా  కోరిన కోరికలు నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి.. అనంతరం సూర్య భగవానుడికి విధిగా నీటితో అర్ఘ్యన్ని  సమర్పించాలి. ఇలా చేయడం వలన సూర్యభగవానుని అనుగ్రహాన్ని పొందుతారు. పుణ్య ఫలితాలను పొందుతారు. అంతే కాదు సూర్యుడి అనుగ్రహంతో సమాజంలో గౌరవం, సంపదలు లభిస్తాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుని పూజించడానికి రాగి అత్యుత్తమని.. కనుక రాగి పాత్రను  ఉపయోగించాలని చెప్పారు. రాగి పాత్రను తీసుకుని అందులో నీటిని పోసి చందనం, కుంకుమ, అక్షతలు వేసి ఎరుపు రంగు పూలు సమర్పించాలి. దీపం, రాగి పాత్రను ఒక ప్లేట్‌లో ఉంచండి. రాగి పాత్రలో నీరుని “ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి సమర్పించండి. సూర్య భగవానుడికి అర్ఘ్య సమర్పణ చేస్తున్నప్పుడు..  రెండు చేతులను పైకి ఎత్తండి.. సూర్యుని బింబాన్ని దర్శిస్తూ ఈ 12 మంత్రాలను జపించండి. ఇలా చేయడం వలన మానసిక శాంతి శారీరక ఆరోగ్యం, ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.

అర్ఘ్యం సమర్పిస్తూ జపించాల్సిన 12 మంత్రాలు

  1. ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः)
  2. ఓం రవయే నమః (ॐ रवये नमः)
  3. ఇవి కూడా చదవండి
  4. ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः)
  5. ఓం భానవే నమః (ॐ wभानवे नमः)
  6. ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः)
  7. ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः)
  8. ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः)
  9. ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः)
  10. ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः)
  11. ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः)
  12. ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः)
  13. ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः)

ఆదివారం రోజు మాత్రమే కాదు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి నీటితో అర్ఘ్యం వలన సూర్య భగవానుని అనుగ్రహం పొందవచ్చునని నమ్మకం. ప్రతిరోజూ సాధ్యం కాకపోతే.. ప్రతి ఆదివారం అర్ఘ్యం సమర్పించండి.. ఈ 12 మంత్రాలను జపించండి. దీనితో జీవితాంతం ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. సూర్యభగవానుడు ఆరోగ్ర ప్రదాత కనుక మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. జీవితంలో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు