AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలంటే చాణుక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకోండి..

ఆచార్య చాణక్యుడి విధానాల్లో నిజాయితీ లేని వ్యక్తి జీవితం పతనం ఖాయం అని చెప్పబడింది. నిజాయతీ లేని వ్యక్తి తక్కువ సమయంలో విజయం సాధిస్తాడు. అయితే ఆ విజయం ఎక్కువ కాలం నిలవదని.. నిజాయితీ లేని వ్యక్తి  ఎప్పుడూ లోలోపల కంగారు పడతాడని..ఇదే నిజాయతీ లేని మనిషికి లభించే అతి పెద్ద శిక్ష. జీవితాన్ని భారంగా గడుపుతాడు, అందుకే ఆచార్య చాణక్యుడు నిజాయితీకి దగ్గరగా ఉండాలని,  ఎల్లప్పుడూ మనస్సాక్షిని వినమని సూచించాడు.

Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలంటే చాణుక్యుడు చెప్పిన రహస్యాలు తెలుసుకోండి..
Chanakya Motivational Quotes
Surya Kala
|

Updated on: Dec 07, 2023 | 9:43 AM

Share

ఆచార్య చాణక్యుడు తక్ష శిలలో అధ్యాపకుడిగా పనిచేశారు. మంది అధ్యాపకుడు.. అంతేకాదు అతను  జీవితంలోని ప్రతి రంగంలో జ్ఞానవంతుడు. గొప్ప పండితుడు. మనిషి జీవితాన్ని ఆనందమయం చేసేందుకు మంచి చెడుల గురించి వివరిస్తూ చాణక్య నీతిలో పేర్కొన్నాడు. జీవితంలో ఏ పనులు చేస్తే విజయం సొంతం అవుతుందో.. జీవితంలో ఆనందాన్ని పొందవచ్చో.. చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రంలో రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం.

సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడండి

మనిషికి సోమరితనం శత్రువు అని మనందరం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇది 100 శాతం నిజం. ఆచార్య చాణక్యుడు సోమరితనాన్ని మనిషికి అతిపెద్ద శత్రువుగా కూడా అభివర్ణించాడు. శ్రమ పడడానికి ఇష్టపడని వ్యక్తి ఎప్పుడూ జీవితంలో అభివృద్ధి చెందలేడని పేర్కొన్నాడు. వ్యక్తి విధిని మార్చగల సామర్థ్యం హార్డ్ వర్క్ కి మాత్రమే ఉంది. అదే సమయంలో సోమరితనం వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది.

నిజాయితీ పరులై ఉండండి..

ఆచార్య చాణక్యుడి విధానాల్లో నిజాయితీ లేని వ్యక్తి జీవితం పతనం ఖాయం అని చెప్పబడింది. నిజాయతీ లేని వ్యక్తి తక్కువ సమయంలో విజయం సాధిస్తాడు. అయితే ఆ విజయం ఎక్కువ కాలం నిలవదని.. నిజాయితీ లేని వ్యక్తి  ఎప్పుడూ లోలోపల కంగారు పడతాడని..ఇదే నిజాయతీ లేని మనిషికి లభించే అతి పెద్ద శిక్ష. జీవితాన్ని భారంగా గడుపుతాడు, అందుకే ఆచార్య చాణక్యుడు నిజాయితీకి దగ్గరగా ఉండాలని,  ఎల్లప్పుడూ మనస్సాక్షిని వినమని సూచించాడు. తన మనస్సాక్షిని విని జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ  సంతోషంగా ఉంటాడు. జీవితంలో విజయాన్ని కూడా సాధిస్తాడు.

ఇవి కూడా చదవండి

ప్రసంగంపై నియంత్రణ

ఆచార్య చాణక్యుడి విధానంలో జీవితం సంతోషంగా ఉండడానికి, విజయవంతం కావడానికి అతి పెద్ద రహస్యం వాక్కు నియంత్రణ అని చెప్పబడింది. తమ మాటలను అదుపులో ఉంచుకునే వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని పొందడమే కాకుండా ఎప్పుడూ సంతోషంగా ఉంటాడని చాణక్య నీతిలో చెప్పబడింది. అదే సమయంలో మాటలను నియంత్రించుకోని వ్యక్తులు సమాజం నుండి తిరస్కరణ పొందుతారు. అంతేకాదు పనికిరాని విషయాలను మాట్లాడడం, తప్పుగా మాట్లాడటం వల్ల ఒకొక్కసారి వివాదాల్లో చిక్కుంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేరు. అందువల్ల, విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మాటపై నియంత్రణ చాలా ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు