Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakha: సంతకు వెళ్ళొస్తూ వాగులో గిరిజనుల గల్లంతు.. ఘాట్ రోడ్‌లో వాహనాలకు నో ఎంట్రీ..

అల్లూరి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, గడ్డల్లో వరద ఉదృతి కొనసాగుతోంది. ఘాట్ రోడ్లు కొండ చర్యలు విరిగి పడు తుండడంతో ప్రమాదకరంగా మారాయి. భారీ వర్షాలకు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు. గల్లంతైన వారు.. సీతపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి కుమార్ (25) , మిరియాల కమల (40), గెమ్మెల లక్ష్మి (50) గా గుర్తించారు.

Visakha: సంతకు వెళ్ళొస్తూ వాగులో గిరిజనుల గల్లంతు.. ఘాట్ రోడ్‌లో వాహనాలకు నో ఎంట్రీ..
Floods In Alluri District
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Dec 07, 2023 | 9:12 AM

తుఫాన్ తీరం దాటినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలకు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు. అనంతగిరి మండలం భింపోల్ లో ఉదృతంగా ప్రవహిస్తుంది లవ్వగెడ్డ. వాగుని దాటుతూ దీని ప్రవాహంలో ముగ్గురు గిరిజనుల గల్లంతయ్యారు.  సీతపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి కుమార్ (25), మిరియాల కమల (40), గెమ్మెల లక్ష్మి (50) గా గుర్తించారు. కాశిపట్నం సంతకు వెళ్లి తిరుగు ప్రయాణంలో గెడ్డ దాటుతుండగా ఘటన జరిగింది. గాలింపు చర్యలు ప్రారంభించారు అధికారులు. పొద్దు పోయినప్పటికీ వాళ్ళ ఆచూకీ కనిపించలేదు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే అవకాశం ఉంది. పిఓ అభిషేక్ స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురులో కాశీపట్నం వద్ద కుమార్ మృతదేహం లభించింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని టీవీ9 తో అనంతగిరి తహసిల్దార్ రాంబాయి వెల్లడించారు.

చేపల వేటకు వెళ్లి మరో గిరిజనుడు..

మరోవైపు.. పెదబయలు మండలం పరదానిపుట్టులో గెడ్డలో మరో గిరిజనుడు గల్లంతయ్యాడు. చేపల వేటకు వెళ్లి గెడ్డ ఉధృతికి గడ్డలో కొట్టుకుపోయాడు కిల్లో రామకృష్ణ. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పశువుల కాపరులను కాపాడిన వాలంటీర్..

మరోవైపు పాడేరు మండలం ఇరాడపల్లి మత్స్య గెడ్డ లో వరద ఉధృతికి ముగ్గురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. వారిని అత్యంత చాకచక్యంగా వ్యవహరించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు  వాలంటీర్ నాగేశ్వరరావు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఘాట్ రోడ్ లో వాహనాలకు నో ఎంట్రీ..

అల్లూరి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, గడ్డల్లో వరద ఉదృతి కొనసాగుతోంది. ఘాట్ రోడ్లు కొండ చర్యలు విరిగి పడు తుండడంతో ప్రమాదకరంగా మారాయి. రోడ్లపైకి రాళ్లు మట్టి వచ్చి చేరుతుంది. రహదారులు స్తంభిస్తున్నాయి. దీంతో ఈ రోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఘాట్ రోడ్లలో వాహనాలను గత రాత్రి నుంచి నిలిపివేశారు. అత్యవసరమైతే పరిమితంగా అనుమతిస్తున్నారు. దీంతో అరకు ఘాట్ రోడ్డు దిగువన చిలకల గడ్డ చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ముందు జాగ్రత్తగా ఆర్టీసీ అధికారులు బస్సులను నిలిపివేశారు. పాడేరులో డిపో పరిమితం అయ్యాయి ఆర్టీసీ బస్సులు. అధికారుల నుంచి క్లియరెన్స్ వచ్చాకే బస్సులను నడుపుతామని టీవీ9తో అన్నారు ఆర్టీసీ డిఎం శ్రీనివాసరావు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు గడ్డలు దాటవద్దని అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..