Thursday Puja: వివాహం ఆలస్యం అవుతుందా.. ఆర్ధిక ఇబ్బందులా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో బృహస్పతి గ్రహం బలహీన స్థితిని నివారించడానికి గురువారం నాడు కొన్ని చర్యలు చేపట్టాలి. దీని ద్వారా బృహస్పతి గ్రహం దోష నివారణ జరుగుతుంది. బృహస్పతి గ్రహం చెడు ప్రభావం వలన ఇల్లు, వైవాహిక జీవితం, ఆదయ మార్గాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఎవరైతే మహావిష్ణువును సంపూర్ణ భక్తితో పూజిస్తారో, మంత్రాలను పఠిస్తూ, గురువారం ఉపవాసం ఉంటారో, వారి జీవితంలో అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని, సంపూర్ణ సౌభాగ్యం కూడా లభిస్తుందని నమ్ముతారు.
హిందూ మతంలో గురువారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. గురువారానికి అధిష్ట దేవతగా బృహస్పతిని పరిగణిస్తారు. దేవ గురువు అయిన బృహస్పతి నవ గ్రహాల గురువు ప్రతి మానవుడి జాతకంలో అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తి జీవితంలో భార్య, భర్త, పిల్లలు, సంతోషకరమైన వైవాహిక జీవితం, వివాహం, విద్య, ఆనందం, శ్రేయస్సు , తెలివితేటలు వంటి అనేక ముఖ్యమైన విషయాలకు బృహస్పతి బాధ్యత వహిస్తాడు. ఎవరి జాతకంలోనైనా బృహస్పతి స్థానం బలహీనంగా ఉంటే వారు జీవితంలో అనేక రకాల కష్టాలను దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది.
గురువారం ప్రాముఖ్యత
జాతకంలో బృహస్పతి గ్రహం బలహీన స్థితిని నివారించడానికి గురువారం నాడు కొన్ని చర్యలు చేపట్టాలి. దీని ద్వారా బృహస్పతి గ్రహం దోష నివారణ జరుగుతుంది. బృహస్పతి గ్రహం చెడు ప్రభావం వలన ఇల్లు, వైవాహిక జీవితం, ఆదయ మార్గాలపై ప్రభావాన్ని చూపుతుంది. ఎవరైతే మహావిష్ణువును సంపూర్ణ భక్తితో పూజిస్తారో, మంత్రాలను పఠిస్తూ, గురువారం ఉపవాసం ఉంటారో, వారి జీవితంలో అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని, సంపూర్ణ సౌభాగ్యం కూడా లభిస్తుందని నమ్ముతారు.
గురువారం చేయాల్సిన పరిష్కారాలు
- గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించి అరటి చెట్టుకు పూజ చేయండి. అరటి చెట్టును పూజించేటప్పుడు.. నీరు సమర్పించి స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించండి. అప్పుడు అక్కడ కూర్చుని విష్ణువు 108 నామాలను ఉచ్చరించండి. ఇలా చేయడం వల్ల వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
- గురువారం నాడు సూర్యభగవానునికి నీరు సమర్పించి విష్ణువు ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శ్రీ హరి సంతోషించి సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు.
- గురువారం విష్ణు చాలీసా పారాయణం చేయడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు. దర్భాలతో చేసిన ఆసనం మీద కూర్చుని విష్ణు చాలీసా పారాయణం చేసి పసుపు పువ్వులు, పండ్లను దేవునికి సమర్పించండి. దీంతో మీరు అన్ని రంగాల్లో పురోగమిస్తారు.
- గురువారం నాడు పండ్లను దానం చేయడం ద్వారా జాతకంలో శుభ యోగం ఏర్పడి గురు గ్రహ స్థితి బలపడుతుంది. ఈ రోజు పసుపు పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. వ్యాపారంలో లాభం వస్తుంది.
- కుంకుమపువ్వు నివారణ గురువారం నాడు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. గురువారం నాడు శ్రీ మహా విష్ణువుకు పాలలో కుంకుమపువ్వు వేసి లేదా కుంకుమపువ్వు పాయసం తయారు చేసి కుటుంబ సభ్యులకు పంచిపెట్టండి. ఇది జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక సంక్షోభం ఉండదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు