Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: దుర్గమ్మ గుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన.. త్వరలో మోడరన్ ఇంద్రకీలాద్రిగా దర్శనం..

మాస్టర్ ప్లాన్ లో ఫెజ్ ల వారీగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని 216.05  కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దుర్గ గుడిని తీర్చిదిద్దునున్నారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఆలయాభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు దేవస్థాన నిధులతో మోడరన్ ఇంద్రకీలాద్రిగా మారనుంది.

Indrakeeladri: దుర్గమ్మ గుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన.. త్వరలో మోడరన్ ఇంద్రకీలాద్రిగా దర్శనం..
Indrakeeladri Temple
Follow us
Surya Kala

|

Updated on: Dec 07, 2023 | 10:16 AM

దుర్గమ్మ భక్తులకు సకల సౌకర్యాలను కల్పిస్తూ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ ఆలయాన్ని అందంగా తీర్చిద్దిడానికి ఏపీ సర్కార్ ప్రణాళికను రెడీ చేసింది. విజయవాడ కనకదుర్గ గుడి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉదయం 8;34 కు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అభివృద్ధి పనులు పూర్తైన తర్వాత రూపుదిద్దుకునే ఇంద్రకీలాద్రి కొండ నమూనాను సీఎం పరిశీలించారు.

కనకదుర్గ గుడి సందర్శనలో భాగంగా ఇప్పటికే నిర్మాణం పూర్తైన మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం ప్రారంభించారు. పూర్తైన అనేక పనులను కూడా సీఎం ప్రారంభించారు. నాలుగు కోట్ల 25 లక్షల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ఎల్‌టీ ప్యానెల్‌ బోర్డులు, ఎనర్జీ, నీటి నిర్వహణ, స్కాడా పనులు కూడా పూర్తయ్యాయి. వీటిన్నింటిని సీఎం ప్రారంభించారు.

మాస్టర్ ప్లాన్ లో ఫెజ్ ల వారీగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయాన్ని 216.05  కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దుర్గ గుడిని తీర్చిది ద్దునున్నారు. ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆలయాభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు విడుదల చేసింది. రూ. 131 కోట్ల దేవస్థానం నిధులు.. 5 కోట్లు దాతల నిధులు.. 33 కోట్లు ప్రైవేట్ భాగస్వామ్యంతో..మొత్తం 216.05 కోట్ల ప్రాజెక్ట్ పనులకు కేటాయించారు.

శంకుస్థాపన పనులు అన్న ప్రసాద భవనం, ప్రసాదం పోటు, కనకదుర్గ నగర్ నుండి మహా మండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ,రాజా గోపురం ముందు భాగాన మెట్ల మార్గం.. క్యూ కాంప్లెక్స్, మహా రాజా ద్వారా నిర్మాణం, కేశఖండన శాల, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, కొండపై గ్రానెట్ రాతి యాగశాలతో మోడరన్ ఇంద్రకీలాద్రిగా మారనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..