Vastu Tips: బాత్ రూమ్ లో ఈ వస్తువులు ఉంటే.. దురదృష్టం వెంటాడినట్టే!

వాస్తు నియమాలను అనుసరించి ఇల్లు కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల మీకు అదృష్టం వెతుక్కుంటు మరీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. అంతే కొన్ని ప్రదేశాల్లో కొన్ని వస్తువులను కూడా పెట్టకూడదంటారు. దాని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీని వల్ల అనేక ఇబ్బందలను ఎదుర్కొనాల్సి వస్తుంది. దీని వల్ల కుటుంబంలో ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడటం, గొడవలు, తగాదాలు వంటివి నెలకొంటి. ఇవే వాస్తు నియమాలు..

Vastu Tips: బాత్ రూమ్ లో ఈ వస్తువులు ఉంటే.. దురదృష్టం వెంటాడినట్టే!
Bathroom Vastu
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2023 | 10:00 PM

వాస్తు నియమాలను అనుసరించి ఇల్లు కట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల మీకు అదృష్టం వెతుక్కుంటు మరీ వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. అంతే కొన్ని ప్రదేశాల్లో కొన్ని వస్తువులను కూడా పెట్టకూడదంటారు. దాని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీని వల్ల అనేక ఇబ్బందలను ఎదుర్కొనాల్సి వస్తుంది. దీని వల్ల కుటుంబంలో ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడటం, గొడవలు, తగాదాలు వంటివి నెలకొంటి. ఇవే వాస్తు నియమాలు బాత్ రూమ్ లో కూడా వర్తిస్తాయి. బాత్ రూమ్ లో ఉండే వస్తువుల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. వీటి వల్ల కూడా నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీల ఎఫెక్ట్ పడతాయి. అసలు బాత్ రూమ్ లో ఎలాంటి వస్తువులు ఉండాలి? ఎలాంటి వస్తువులు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

అద్దాలు:

బాత్ రూమ్ లో పెట్టే అద్దాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది బాత్ రూమ్ లో అద్దాలను పెట్టు కుంటారు. వీటి వల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అలాగే బాత్ రూమ్ లో ఉండే అద్దం ఎప్పుడూ విరిగి పోయి ఉండకూడదు. ఒక వేళ ఉంటే వెంటనే దాన్ని పారేయాలి. లేకుంటే ప్రతి కూలతలను సృష్టిస్తాయి.

బకెట్లు:

బాత్ రూమ్ లో ఉండే బకెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉండకూదట. ఒక వేళ ఖాళీ బకెట్ ఉంటే దాన్ని బోర్లించి పెట్టాలి. బాత్ రూమ్ లో ఖాళీ బకెట్ ఉంటే.. అది ఇంట్లో ఉండే డబ్బులను ఖాళీ చేస్తుంది. అలాగే విరిగి పోయిన, పగిలిన బకెట్లు కూడా ఉండకుండా చూసుకోండి.

ఇవి కూడా చదవండి

మొక్కలు – చిత్రాలు:

చాలా మంది ఇప్పుడు బాత్ రూమ్ లో మొక్కలను కూడా పెడుతున్నారు. బాత్ రూమ్ లో మొక్కలను పెట్టడం అసలు ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే ఎండి పోయిన మొక్కలు ఉంటే వెంటనే వాటిని తొలగించాలి. అదే విధంగా డెకరేషన్ కోసం బాత్ రూమ్ లో చిత్రాలను కూడా పెడుతూ ఉంటారు. ఇవి చినిగి పోయి ఉంటే వాటిని పారేయాలి.

ట్యాప్ లీక్ అవ్వకూడదు:

బాత్ రూమ్ లో ఎప్పుడూ ట్యాప్ లీక్ కాకుండా చూసుకోండి. ఇలా లీక్ అవ్వడం వల్ల ప్రతికూల శక్తిని వ్యాపింప చేస్తుంది. అంతే కాకుండా ఆర్థిక పరిస్థిపై చెడు ప్రభావం పడుతుంది.

గమనిక: ఇక్కడ తెలిపిన సమాచారం.. కేవలం అవగాహన కోసం మాత్రమే. వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. సలహాలు, సూచనలు కావాలన్నా వాస్తు శాస్త్ర నిపుణులను కలవడం మంచిది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే