Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు.. పీవోకే మనదే..

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా. జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవప్థీకరణ బిల్లుపై లోక్‌సభలో రెండు గంటల పాటు చర్చ జరిగింది.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు.. పీవోకే మనదే..
Jammu And Kashmir
Follow us
Surya Kala

|

Updated on: Dec 07, 2023 | 8:02 AM

జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు, జమ్మూకశ్మీర్‌ రీ ఆర్గనైజేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా . జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెరుగుతుందని, 70 ఏళ్లుగా కశ్మీర్‌లో జరుగుతున్న అన్యాయానికి ఈ బిల్లుతో న్యాయం జరుగుతుందన్నారు. నెహ్రు వల్లే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమస్య వచ్చిందన్నారు..

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు-2023’, ‘జమ్మూకశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లు-2023’ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రెండు బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షా. జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవప్థీకరణ బిల్లుపై లోక్‌సభలో రెండు గంటల పాటు చర్చ జరిగింది. గతంలో జమ్మూకశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. అసెంబ్లీలో సీట్ల సంఖ్య 90కి పెంచాలని ప్రతిపాదించారు. ఇంతకుముందు కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్‌ డివిజన్‌లో అసెంబ్లీ స్థానాలను 47, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు.

కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్‌ నుంచి వలస వెళ్లిన వాళ్లకి, ఒక స్థానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి స్థిర పడినవారికి రిజర్వ్‌ చేసినట్లు అమిత్ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో 70 ఏళ్ల నుంచి అన్యాయానికి గురైన వాళ్లకు ఈ బిల్లుతో న్యాయం చేసినట్టు అమిత్‌షా తెలిపారు.

ఆర్టికల్‌ 370 రద్దు తరువాత ఉగ్రవాదుల హింస తగ్గలేదన్న విమర్శలను అమిత్‌షా తిప్పికొట్టారు. ఉగ్రవాదుల హింస చాలావరకు తగ్గుముఖం పట్టిందన్నారు. 2026 నాటికి టెర్రరిజాన్ని అంతం చేస్తామన్నారు. నెహ్రూ చేసిన రెండు తప్పిదాల వల్లే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సమస్య వచ్చిందన్న అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశారు. దేశ తొలి ప్రధానిని పదే పదే అవమానించడం అమిత్‌షాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..