Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: తుఫాన్ తీరం దాటినా తీరని నష్టం.. వరదల్లో గల్లంతయిన పంట నష్టం.. విరిగిన విద్యుత్ స్థంభాలు.. కోట్ల మేర ఆస్తి నష్టం

ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానలు, వరదలు ఇంకా  బీభత్సం సృష్టిస్తునే ఉన్నాయి. సుడిగాలుల విధ్వంసం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా లో పరిస్థితి కన్నీటి వ్యథగా మారింది.  ఈదురు గాలుల ధాటి భారీ  చెట్లు, కరెంట్‌ స్థంభాలు కుప్పకూలాయి.. గాలుల బీభత్సానికి ట్రాక్టర్లు పల్టీ కొట్టాయి. ఇక పంటల సంగతి సరే సరి.. సర్వం వర్షార్పణం. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా వీరసారంలో  టోర్నడో ధాటికి  కక్క-ముక్క రెస్టారెంట్‌ ముక్కలు చెక్కలైంది.

Cyclone Michaung: తుఫాన్ తీరం దాటినా తీరని నష్టం.. వరదల్లో గల్లంతయిన పంట నష్టం.. విరిగిన విద్యుత్ స్థంభాలు.. కోట్ల మేర ఆస్తి నష్టం
Cyclone Michaung Effect
Follow us
Surya Kala

|

Updated on: Dec 07, 2023 | 7:48 AM

మిన్ను విరిగి మీదపడ్డట్టుగా విరుచుకుపడింది మాయదారి మిచౌంగ్‌. తుఫాన్‌ ఎప్పుడో తీరం దాటింది. అయితే తుఫాన్ మిగిల్చిన విషాదం వెంటాడుతూనే ఉన్నది. వానలు-వరదల ధాటికి కుప్పకూలిన పల్లెలు ఇంకా కన్నీరు పెడుతూనే ఉన్నాయి. ఈదురు గాలులు..వాన..వరదలతో ఏపీలో అపార పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట  వరదల్లో గల్లంతయి రైతన్నల గుండె కన్నీరవుతోంది. పంటనష్టం మాత్రమే కాదు.. తుఫాన్‌ ధాటికి బతుకులు ఆగమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయాయి.

చిత్తూరు జిల్లా లో వరద గండం నుంచి గట్టెక్కేందుకు హైవే రోడ్డును ధ్వంసం చేయాల్సి వచ్చింది.  జనవాసాల్లోకి దూసుకొచ్చిన వరద..ఇళ్లను ముంచేసింది . కార్లను బండ్లను ఈడ్చుకెళ్లింది.

ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానలు, వరదలు ఇంకా  బీభత్సం సృష్టిస్తునే ఉన్నాయి. సుడిగాలుల విధ్వంసం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా లో పరిస్థితి కన్నీటి వ్యథగా మారింది.  ఈదురు గాలుల ధాటి భారీ  చెట్లు, కరెంట్‌ స్థంభాలు కుప్పకూలాయి.. గాలుల బీభత్సానికి ట్రాక్టర్లు పల్టీ కొట్టాయి. ఇక పంటల సంగతి సరే సరి.. సర్వం వర్షార్పణం. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా వీరసారంలో  టోర్నడో ధాటికి  కక్క-ముక్క రెస్టారెంట్‌ ముక్కలు చెక్కలైంది. తీరం దాటిన తుఫాన్ సృష్టించిన బీభత్సంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ పల్లె చూసినా వరద కష్టాలే .. కాలనీలు చెరువుల్లా మారాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రాజానగరం వరద బీభత్సంతో కన్నీటి సంద్రమైంది. రోడ్డన్నది కంటికి కన్పించడంలేదు. ఎటు చూడూ వరదే వరద. ఏకంగా సుబ్రమణ్యస్వామి ఆలయ్యంలో వరద  పోటెత్తింది.

ఇవి కూడా చదవండి

నెల్లూరు జిల్లాపై తుఫాన్ ప్రభావం చూపింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్  కుప్ప కూలాయి. కరెంట్‌ లేక జనం చీకట్లో మగ్గుతున్నాయి. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తిరుపతి ఎస్వీ వర్సీటీలో భారీ వృక్షాలు నేలకూలాయి. అటు తిరుమల క్షేత్రంలోనూ పలుచోట్ల పెద్ద పెద్ద చెట్లు కుప్పకూలాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.

అటు  ఉత్తరాంధ్రలోనూ తుఫాన్‌  చేసిన గాయం మాములుగా లేదు. పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. వరద ఇంకా హడలెత్తిస్తూనే ఉంది. అనకాపల్లి జిల్లా శారద నది ఉగ్రరూపం దాల్చింది. వడ్డాది వంతెన వరదలో కనుమరగైనట్టుగా ఉంది దుస్థితి.

ద్వారాక తిరుమలలో  రోడ్లు ఊచకోతకు గురయ్యాయి. ఊళ్లో ఉండేట్టు లేదు. ఎటైనా వెళ్దామంటే రోడ్లు లేదు. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం కట్టుబట్టలతో మిగిలారు. ఇలాంటి కష్టాన్ని నష్టాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని వాపోతున్నారు. దంచికొడుతున్న వానలతో భారీ వృక్షాలు ,కరెంట్‌ స్తంభాలు కుప్పకూలాయి. యలమంచిలిలో కాకివాని వీధిలో  గోడ కూలి 3 బైకులు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ టైమ్‌లో అక్కడ ఎవరూ లేరు కాబట్టీ ప్రమాదం తప్పింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..