Health Astrology: ఆ రాశుల వారికి ఆరోగ్యం భేష్..! మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..

గ్రహ సంచారం రీత్యా ఏడు రాశుల వారు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అనారోగ్యాలతో ఉన్నవారికి కూడా చాలావరకు ఉపశమనం కలుగుతుంది. సరైన వైద్యుడు లభ్యం కావడం, సరైన చికిత్స అందుబాటులోకి రావడం, మందులు పని చేయడం, సరిగ్గా రోగ నిర్ధారణ జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. శస్త్ర చికిత్సలు చేయవలసి రావడం, అనారోగ్యంతో ఇతరుల మీద ఆధారపడడం, వైద్య ఖర్చులు పెరగడం వంటివి కూడా జరగకపోవచ్చు.

Health Astrology: ఆ రాశుల వారికి ఆరోగ్యం భేష్..! మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
Health Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 08, 2023 | 6:42 PM

గ్రహ సంచారం రీత్యా ఏడు రాశుల వారు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అనారోగ్యాలతో ఉన్నవారికి కూడా చాలావరకు ఉపశమనం కలుగుతుంది. సరైన వైద్యుడు లభ్యం కావడం, సరైన చికిత్స అందుబాటులోకి రావడం, మందులు పని చేయడం, సరిగ్గా రోగ నిర్ధారణ జరగడం వంటివి చోటు చేసుకుంటాయి. శస్త్ర చికిత్సలు చేయవలసి రావడం, అనారోగ్యంతో ఇతరుల మీద ఆధారపడడం, వైద్య ఖర్చులు పెరగడం వంటివి కూడా జరగకపోవచ్చు. ఆ రాశులుః మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం. ఈ ఫలితాలు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ వర్తించే అవకాశం ఉంది. సాధారణంగా జాతక చక్రంలో ఆరవ స్థానాన్నిబట్టి ఆరోగ్యం గురించి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

  1. మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మికంగా అనారోగ్యం చేయ డానికి, అంతే ఆకస్మికంగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజానికి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి మంచి వైద్యం లభించే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ శస్త్ర చికిత్సలకు అవకాశం ఉండదు. ఇతరుల మీద ఆధార పడాల్సిన అవసరం కూడా ఉండదు. సాధారణ వైద్యంతో నయమయ్యే అవకాశం ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఆరవస్థానాధిపతి అయిన శుక్రుడే సంచారం చేస్తున్నందువల్ల ఆరోగ్య భంగం జరగకపోగా, దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడుతున్నవారికి సైతం చాలా వరకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుముఖం పడతాయి. శస్త్ర చికిత్సలకు ఆస్కారం లేదు. చిన్నపాటి అనారోగ్యాలకు కూడా అవకాశం లేదు. సరైన వైద్యుడు, సరైన చికిత్స అందుబాటులో ఉంటాయి. వాహన ప్రమాదాలకు కూడా ఏమాత్రం అవకాశం లేదు.
  3. మిథునం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఆరవ స్థానాధిపతి కుజుడు, దాంతో పాటు రవి కూడా ఉన్నందువల్ల అనారోగ్యాలు దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఎటువంటి అనారోగ్యం నుంచయినా కోలుకోవడానికి ఇది చాలావరకు అనుకూలమైన సమయం. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి ఆశించినంతగా ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యం, సరైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
  4. కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నందువల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఏదైనా చిన్న అనారోగ్యం చేసినా అతి త్వరగా, అతి వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సరైన వైద్యుడు దొరకడం, సరైన చికిత్స లభ్యం కావడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అనారోగ్యంతో పడకపెట్టడం జరగదు. వైద్య ఖర్చులు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది.
  5. కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు ఆరవ స్థానంలోనే ఉన్నందువల్ల, సాధా రణంగా అనారోగ్యంతో పడకపెట్టడం అనేది జరగకపోవచ్చు. ఎటువంటి అనారోగ్యమైనా తగ్గిపో వడం ప్రారంభం అవుతుంది. సరైన వైద్యుడు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్వల్ప అనారోగ్యం కూడా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. వైద్య ఖర్చులు కూడా గణనీయంగా తగ్గి పోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
  6. తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రాహు సంచారం వల్ల అనారోగ్యాల మీద విజయం లభిస్తుంది. అనారోగ్యాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా అప్రయత్నంగా ఉపశమనం లభించడం ప్రారంభమవుతుంది. అనుకోకుండా సరైన చికిత్స లభించి దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు అదుపులో ఉండడం జరుగుతుంది. స్వల్పకాలిక అనారోగ్యాలకు కూడా అవకాశం ఉండదు. వైద్య ఖర్చులు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు.
  7. వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శుభగ్రహమైన గురువు సంచారం చేస్తున్నందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరోగ్య భంగం ఉండదు. అనారోగ్యాలు దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు. దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులతో అవస్థలు పడుతున్నవారికి సరైన వైద్య చికిత్సలు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంటుంది. శస్త్రచికిత్సలకు అవకాశం లేదు. కొద్ది ప్రయత్నంతో దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్య వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది.

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు