Luck Astrology: మూడో స్థానంలో కీలక గ్రహాల సంచారం.. అతి తక్కువ ప్రయత్నంతో వారికి మహా యోగం పక్కా.. !
కొద్ది ప్రయత్నంతో ఆశించిన శుభ ఫలితాలను పొందే అవకాశం ఆరు రాశులకు లభిస్తోంది. ఆర్థికం, ఉద్యోగం, పెళ్లి, విదేశీయానం తదితర అంశాలకు సంబంధించి వీరు కొద్దిగా ప్రయత్నించినా అనుకూల ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. ఈ రాశులుః కర్కాటకం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభం. మిగిలిన రాశుల వారికి ప్రయత్నం చేసినా ఫలించకపోవడమో, ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేకపోవడమో జరుగుతుంది.
కొద్ది ప్రయత్నంతో ఆశించిన శుభ ఫలితాలను పొందే అవకాశం ఆరు రాశులకు లభిస్తోంది. ఆర్థికం, ఉద్యోగం, పెళ్లి, విదేశీయానం తదితర అంశాలకు సంబంధించి వీరు కొద్దిగా ప్రయత్నించినా అనుకూల ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. ఈ రాశులుః కర్కాటకం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మకరం, కుంభం. మిగిలిన రాశుల వారికి ప్రయత్నం చేసినా ఫలించకపోవడమో, ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేకపోవడమో జరుగుతుంది. ఈ ఏడు రాశుల వారికి మాత్రం అతి తక్కువ ప్రయత్నంతో మహా యోగాలు పట్టడం, జీవితమే సానుకూలంగా మారిపోవడం వంటివి జరుగుతాయి. ఏ రకమైన ప్రయత్నాన్నయినా మూడవ స్థానాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశికి ప్రస్తుతం తృతీయ స్థానంలో సంచరిస్తున్న కేతు గ్రహం వల్ల చిన్నపాటి ప్రయత్నంతో ఆర్థిక లాభాలు చేకూరడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం వంటి వాటికి కూడా ఆస్కారముంది. దాదాపు ఏ ప్రయత్నం చేసినా సానుకూలపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. తల్లితండ్రులతో లేదా కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అయి వారు ఇంటికి రావడం కూడా జరుగుతుంది.
- సింహం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో, అందులోనూ స్వస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నందువల్ల ఉద్యోగ, ఆర్థిక, పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. అయితే, తప్పనిసరిగా కొద్దిపాటి ప్రయత్నమైనా చేయాల్సి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించిన కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభించడానికి అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి.
- కన్య: ఈ రాశివారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో కుజ, రవులు సంచారం చేయడం ఒక విధంగా అదృష్ట మనే చెప్పాలి. సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఏ మాత్రం ప్రయత్నం చేసినా మంచి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో నెగ్గే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివా దాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరు తాయి. ఈ సమయంలో బద్ధకించి కూర్చోవడం, ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది కాదు.
- తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ సంచారం చేయడం వల్ల స్వల్ప ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆస్తి సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మధ్య వర్తిత్వాలు, కౌన్సెలింగులు సత్ఫలితాలనిస్తాయి. ఎటువంటి ఆర్థిక ప్రయత్నం తలపెట్టినా ఆశించిన ప్రతిఫలం అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు కూడా ఇది చాలా మంచి సమయం.
- ధనుస్సు: ఈ రాశివారికి తృతీయ స్థానంలో తృతీయాధిపతి శని సంచారం చేయడం అనేక విధాలుగా శుభ ఫలితాలనిస్తుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా అది విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలు తేలికగా నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మంచి ఉద్యోగం లభించి స్థిరపడడం కూడా జరుగుతుంది. ఆస్తి వివాదం కొద్ది ప్రయత్నంతో సాను కూలంగా పరిష్కారం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కోలుకునే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నం అయినా తప్పకుండా నెరవేరుతుంది. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయ ప్రయత్నా లన్నీ కలిసి వస్తాయి. విహార యాత్రలు, తీర్థయాత్రలకు చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. మధ్యవర్తిత్వం, కౌన్సెలింగ్ అనుకూలంగా ఉంటాయి.
- కుంభం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్న గురువు వల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు, జీత భత్యాలకు సంబంధించి అధికారులతో చర్చలు వగైరాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఆరోగ్యంలో ఆశించిన మెరుగుదల ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనాలుంటాయి. కొద్ది ప్రయత్నంతో తోబుట్టువులు, తల్లితండ్రులతో ఉన్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి.