Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nadakuduru: కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. నరకాసురుడి సంహరించి.. మోక్షం ప్రసాదించిన ప్రాంతం..

నరకాసుర సంహారం అనంతరం పాటలీ వనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీ కృష్ణ సత్య భామలు లక్ష్మీనారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు కథనం. పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణుడి విగ్రహం నేటికీ పూజలు అందుకుంటోంది. ఇక్కడి ప్రశాంతత పవిత్రత రీత్యా శ్రీ కృష్ణసత్యభామ కొంతకాలం ఇక్కడ విహారించినట్లు స్థలపురాణం సారాంశం. కరకట్ట దిగువునే నదిలో కొబ్బరి చెట్లు, పాటలీ వృక్షాలు, ఉసిరి చెట్ల మధ్యలో ఆలయం ఉంది.

Nadakuduru: కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం .. నరకాసురుడి సంహరించి.. మోక్షం ప్రసాదించిన ప్రాంతం..
Historic Village In Krishna
Follow us
M Sivakumar

| Edited By: Surya Kala

Updated on: Dec 11, 2023 | 6:14 PM

నరకోత్తారక క్షేత్రంగా భాసిల్లి కాలక్రమంలో నడకదూరుగా.. నడుకుదురుగా మారిన గ్రామం కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో ఉంది. కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో నడకుదురుకు ద్వాపర యుగంతో విడదీయలేని బంధం ఉంది. నరకాసుర సంహార క్షేత్రంగా మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధి గాంచి కాలక్రమేణా నరకొత్తూరు నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది. ఇక్కడ కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆలయం చెంతనే ఉన్న పాటలీ వనం సందర్శనీయ స్థలాలు పశ్చిమాభిముఖంగా ఉండే ఈ ఆలయానికి విశేష ఖ్యాతి ఉంది. నరకాసురుడి సంహారం జరిగిన క్షేత్రంగా ఆ రాక్షసుడికి మోక్షం ప్రసాదించిన నడకుదురు మోక్షపురిగా గుర్తింపు పొందింది.

పరమశివుడు ఉద్భవించిన ప్రాంతం: దేవతల కోరికపై ద్వాపర యుగంలో ఈ ప్రాంతంలో పరమశివుడు భూగర్భం నుంచి ఉద్భవించాడని కథనం. ఇంద్రుడి ఉద్యాన వనంలోని పాటలీ వృక్షాలను దేవతలు ఇక్కడ నాటారని చెబుతారు. అందుకు గుర్తుగా పాటలీ వృక్షాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. ఇవి మన దేశంలో కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉండటం విశేషం. నారదుడు… నరకాసురుడి వద్దకు వెళ్లి నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి పంచముఖుడనే రాక్షసుడుని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభుడైన శ్రీ పృథ్వీస్వరుణ్ణి పూజించమని సూచిస్తారు. నరకాసురుడు పృథ్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు ఇక్కడి స్వామిని పూజించాడని చరిత్ర చెబుతోంది.

శ్రీకృష్ణసత్యభామ విహారస్థలం: నరకాసుర సంహారం అనంతరం పాటలీ వనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీ కృష్ణ సత్య భామలు లక్ష్మీనారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్లు కథనం. పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణుడి విగ్రహం నేటికీ పూజలు అందుకుంటోంది. ఇక్కడి ప్రశాంతత పవిత్రత రీత్యా శ్రీ కృష్ణసత్యభామ కొంతకాలం ఇక్కడ విహారించినట్లు స్థలపురాణం సారాంశం. కరకట్ట దిగువునే నదిలో కొబ్బరి చెట్లు, పాటలీ వృక్షాలు, ఉసిరి చెట్ల మధ్యలో ఆలయం ఉంది. చుట్టూ పసుపు తోటలు, వాణిజ్య పంటలతో చల్లటి వాతావరణం భక్తులకు స్వాగతం పలుకుతుంది.

ఇవి కూడా చదవండి

యుద్ధం ఇక్కడే: నరకాసురిడి మితిమీరిన ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాలను కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఈ ప్రాంతంలోనే యుద్దానికి దిగుతాడు. యుద్ధంలో శ్రీ కృష్ణుడు మూర్చబోగా సత్యభామ పృథ్వీశ్వర క్షేత్రం సమీపంలోనే ఆ రాక్షసుడిని సంహరించిందని చారిత్రక కధనం. భూదేవికి ప్రతిరూపమైన సత్యభామ ఆ నరకాసురుడికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించి నదీ తీరాన పిండతర్పణాలు వదిలినట్లు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది.

ద్వాపరయుగంతో అనుబంధం: నడకుదురు గ్రామం ప్రాచీనకాలం నుంచి నరకోత్తారక క్షేత్రంగా ప్రాశస్త్యం కలిగి ఉంది. నరకాసుర వధ జరిగిన ప్రాంతంగా స్కాంద పురాణంలో ఉంది. వందేళ్లుగా మామిళ్లపల్లి వంశీయులు స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. ద్వాపరయుగంతో ఈ ఆలయానికి ప్రాంతానికి ఉన్న అనుబంధం ఆలయచరిత్ర, పాటలీ వృక్షాల విశిష్టతను భక్తులకు వివరిస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..