Dreams: మామిడి పండు తింటున్నట్లు కల వచ్చిందా.? ఏమవుతుందో తెలుసా.?
మనకు వచ్చే కలలో కొన్ని మంచికి సూచికగా ఉంటే మరికొన్ని చెడుకు సింబాలిక్ అని పండితులు చెబుతుంటారు. కలల ప్రాముఖ్యతను, వాటి అర్థాలను వివరిస్తూ కలల శాస్త్రంలో పలు అంశాలను ప్రస్తావించారు. నిద్రలో ఒకవేళ మామిడి పండు తింటున్నట్లు.. కల పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో కలల శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. ఇంతకీ కలలో మామిడి పండు తింటున్నట్లు...

నిద్రలో కలలు రావడం సర్వ సాధారణమై విషయం. మనలో చాలా మందికి కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కల వెనకాల ఒక అర్థం ఉంటుందని కలల శాస్త్రం చెబుతోంది. మనకు వచ్చే కలలో కొన్ని మంచికి సూచికగా ఉంటే మరికొన్ని చెడుకు సింబాలిక్ అని పండితులు చెబుతుంటారు. కలల ప్రాముఖ్యతను, వాటి అర్థాలను వివరిస్తూ కలల శాస్త్రంలో పలు అంశాలను ప్రస్తావించారు. నిద్రలో ఒకవేళ మామిడి పండు తింటున్నట్లు.. కల పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో కలల శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. ఇంతకీ కలలో మామిడి పండు తింటున్నట్లు కల వస్తే దేని సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..
* మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌గా పిలుస్తుంటారు. దీని రుచికి సాటైన ఫ్రూట్ మరొకటి ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మామిడి పండును తింట్లునట్లు కలలో కనిపిస్తే.. మీకు త్వరలోనే చాలా డబ్బు రాబోతుందని అర్థం. ఉన్నపలంగా సంపద పెరిగడానికి ఈ కల ఒక సూచికగా చెబుతుంటారు.
* ఒకవేళ కలలో పచ్చి మామిడి తింటున్నట్లు కనిపిస్తే మీ కష్టానికి తగిన ఫలితం త్వరలోనే అందబోతుందని అర్థం. మీరు ఆశించినది త్వరలోనే మీకు లభిస్తుందని అర్థం. ఎలాగైతే ఒక కాయ పండుగా మారడానికి సమయం పడుతుందో మీ కష్టాలు కూడా తొలగిపోతాయని కలల శాస్త్రం చెబుతోంది.
* చెట్ల నుంచి మామిడి పండు రాలి పడుతున్నట్లు కలలో కనిపిస్తే.. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయని అర్థం. ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఈ కల అర్థం. మీరు చేస్తున్న పనికి ప్రతిఫలం దక్కనుందనడానికి సూచికగా పండితులు చెబుతున్నారు.
* ఒక కలలో మామిడి కాయను కోస్తున్నట్లు కనిపించినా మంచి ఫలితాలకు సూచికగా చెబుతున్నారు. మీరు ఏ లక్ష్యం కోసమైతే పనిచేస్తున్నారో అవి సిద్ధించే అవకాశాలు ఉన్నాయడానికి ఈ కల నిదర్శనమని పండితులు చెబుతున్నారు. ఇలా మామిడి ఏ రకంగా కలలో కనిపించినా అది మంచికేనని కలల శాస్త్రం చెబుతోంది. కాబట్టి కలలో మామిడి కనిపిస్తే అది మంచికేనని భావించాలని అంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..