అమ్మవారికి అజ్ఞాత భక్తుడి అరుదైన కానుకలు.. బంగారంతో చేయించిన కనుబొమ్మలు సహా..
భక్తుడు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఆనంతరం ఆలయం కమిటీ సభ్యులకు అందజేసినట్టుగా అర్చకుడు తెలిపాడు. కమిటీ సభ్యులు ఆభరణాలను అమ్మవారికి ధరించి, మొక్కుగా అమ్మవారికి ఇచ్చిన భక్తుడు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని గంగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు..ఆ బంగారు ఆభరణాలతో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా, డిసెంబర్12; తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామ దేవత గంగాలమ్మ తల్లికి తన కోరిక నెరవేరింది అంటూ ఓ భక్తుడు అమ్మవారికి ప్రత్యేక ఆభరణాలు చేయించి పూజారికిచ్చి వెళ్లిపోయాడు….సుమారు 30 గ్రాముల అరుదైన బంగారు అభరణాలను ఓ భక్తుడు అమిత ప్రేమతో అమ్మవారికి సమర్పించాడు..అమ్మవారిని కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని, అమ్మవారికి మొక్కుకొని వెళ్లిపోయారు..
ఆ మొక్కు కొన్ని వారాల వ్యవధిలోనే అమ్మవారు తమ కోరికలు తీర్చారంటూ అమ్మవారికి బంగారు ముక్కుపుడక, కళ్ళు, కను బొమ్మలను ఆలయ అర్చకుడికి ఇచ్చి వెళ్ళిపోయినట్టుగా పూజారి చెప్పాడు. ఆభరణాలు ఇచ్చిన భక్తుడు తమ వివరాలను తెలపవద్దని, ఆభరణాలను అమ్మవారికి ధరించి, భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలని అర్చకుడుకి చెప్పి, ఆశీర్వచనాలు తీసుకుని ఆయన వెళ్లిపోయారు.
భక్తుడు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఆనంతరం ఆలయం కమిటీ సభ్యులకు అందజేసినట్టుగా అర్చకుడు తెలిపాడు. కమిటీ సభ్యులు ఆభరణాలను అమ్మవారికి ధరించి, మొక్కుగా అమ్మవారికి ఇచ్చిన భక్తుడు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని గంగాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు..ఆ బంగారు ఆభరణాలతో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..