AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకో తెలుసా..?

నిర్లక్ష్యం ఓ మునిసిపల్ కమిషర్ కొంప ముంచింది. కొత్తపేటలో ప్రైవేటు భూమిని ఆక్రమించి, కోర్టు ధిక్కార కేసులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఏపీ హైకోర్టు ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాదు రూ. 2,000 జరిమానాతో పాటు 2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించింది హైకోర్టు.

AP High Court: గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకో తెలుసా..?
Ap High Court
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 13, 2023 | 6:52 AM

నిర్లక్ష్యం ఓ మునిసిపల్ కమిషర్ కొంప ముంచింది. కోర్టు ధిక్కార కేసులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి ఏపీ హైకోర్టు ఒక నెల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాదు రూ. 2,000 జరిమానాతో పాటు 2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించింది హైకోర్టు.

గుంటూరు నగరంలోని కొత్తపేటలో యడవల్లి వారి సత్రానికి చెందిన 3,300 గజాల స్థలాన్ని 1965వ సంవత్సరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమించి ఇప్పటికీ కాసుశాయమ్మ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు. అయితే, ఈనాటి వరకూ ఒక్క రూపాయి కూడా లీజ్ చెల్లించకుండా అక్రమంగా సత్రం ఆస్థిని వినియోగిస్తున్నారని విజయవాడకు చెందిన కప్పగంతు జానకిరాం ఏపీ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. పిటీషనర్ తరఫు న్యాయవాది ఫణిదత్ చాణక్య వాదనలు వినిపించారు.

సక్రమమైన లీజు లేకుండా సత్రం ఆస్థిని స్వాధీనం చేసుకున్నవారు ఎవరైనా సరే, అక్రమ ఆక్రమణదారులే అవుతారని వాదించారు న్యాయవాది ఫణిదత్. ఇందుకు ప్రభుత్వ శాఖలు కూడా మినహాయంపు కాదని, అనుమతి లేకుండా ఏళ్ళ తరబడి సత్రం ఆస్థిని అనుభవించడం చట్ట విరుద్ధమని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సత్రానికి బాకాయి పడిన రూ. 2 కోట్ల 70 లక్షలను తక్షణమే చెల్లించి, ఆస్థిని ఖాళీ చేయమని ఆదేశించమని హైకోర్టుకు నివేదించారు.

దీంతో కౌంటర్ దాఖలు చేశారు గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్. సదరు బకాయిలు చెల్లించలేని స్థితిలో జీఎంసీ ఉన్నదని, పేదల సంక్షేమం కొరకు ఉచిత పాఠశాల నిర్వహిస్తున్నామని, బకాయిలు రద్దు కోరుతున్నామని తెలిపారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. మే 12వ తేదీ నాటికి రూ. 25 లక్షలు చెల్లించాలని, తక్షణమే ప్రతి నెలా ప్రతి చదరపు అడుగుకి రూ.2/- చొప్పున అద్దె చెల్లించాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారిని ఆదేశించింది.

అయితే సదరు ఆదేశాలను గుంటూరు మున్సిపల్ కమిషనర్ అమలు చేయడం లేదని పిటిషినర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయకపోవడంతో జీఎంసీ కమిషనర్‌ది కోర్టు ధిక్కార నేరం కింద పరిగణిస్తూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ కీర్తికి నెల రోజులు సాధారణ జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.  2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్ట్రారు కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించింది.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్