Mancherial : బోరు బావి నుంచి గులాబీ రంగు నీళ్లు..భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు.. దేవుని మాయ.. విష ప్రభావమా అంటూ ఆందోళన

అక్కడెక్కడో  ఆకాశం గులాబీ రంగులోకి మారి ప్రపంచాన్ని షాక్ గురి చేసిన ఘటనకు చెన్నూరు లో బోర్ నుండి ఏకదాటిగా గులాబీ దారలా వస్తున్న నీటికి సంబందం ఉందా..? బాక్టీరియా కారణంగానే ఇలా నీరు గులాబీ రంగులోకి మారుతుందా అన్నది తేలాల్సి‌ఉంది. అప్పటి వరకు మాత్రం ఆ నీటిని వినియోగించక పోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు‌.

Mancherial : బోరు బావి నుంచి గులాబీ రంగు నీళ్లు..భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు.. దేవుని మాయ.. విష ప్రభావమా అంటూ ఆందోళన
Pink Colored Water
Follow us
Naresh Gollana

| Edited By: Jyothi Gadda

Updated on: Dec 12, 2023 | 11:20 AM

మంచిర్యాల, డిసెంబర్‌12; మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలకలం రేగింది. చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి అనే ఓ ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు రావడం ఆందోళనకు కారణమైంది. నిన్న రాత్రి వరకు స్వచ్చమైన నీటిని అందించిన కట్ట శ్రీనివాస చారి బోరు.. ఒక్కసారిగా ఉదయం గులాబీ నీటి దారతో దర్శనం ఇవ్వడంతో చారి కుటుంబ సభ్యులు విస్తు పోక తప్పలేదు. ఏకబిగువునా బోరు నుండి గులాబీ రంగులో నీరు ప్రవాహం కొనసాగుతూనే ఉండటంతో భయబ్రాంతులకు‌ గురైన ఇంటి యజమాని శ్రీనివాస్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో గులాబీ రంగు నీటి విషయం చెన్నూరు అంతా దాహనంలా వ్యాపించింది. దీంతో గులాబీ రంగు నీటిని చూసేందుకు కట్ట శ్రీనివాస్ ఇంటికి క్యూ కట్టారు స్థానికులు. అయితే ఈ గులాబీ నీటి‌దారకు కారణాలేంటి.. నీరు విష తుల్యం కావడం కారణంగానే ఇలా జరిగిందా లేక ఇంకా ఏదైనా కారణముందా అన్న ఆందోళన ఆ కాలనీ వాసులను భయబ్రాంతులకు గురి చేసింది. కట్ట శ్రీనివాస్ బోరు నుండి గులాబీ రంగు నీరు రావడంతో ఆ ఇంటి పక్కనే ఉన్న కాలనీ వాసులు తమ బోరు‌నుండి కూడా అలాంటి నీళ్లే వస్తున్నాయేమో అని పరీక్షించడం కనిపించింది. అయితే కేవలం ఆ ఒక్క‌ఇంటి బోర్ నుండే గులాభీ రంగు నీరు వస్తుండటంతో ఆ నీరు విషతుల్యమైందని అనుమా‌నాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అదికారులు ఈ నీటిని పరీక్షించి కారణాలు తెలుసుకోవాలని కోరుతున్నారు చెన్నూరు పట్టణ వాసులు.

అయితే ఇలాంటి ఘటనలే గతంలో ప్రపంచ వ్యాప్తంగా మూడు చోట్ల దర్శనమిచ్చాయి. గుజరాత్‌లోని బనాస్ కంఠ జిల్లా సుయిగామ్ గ్రామ సమీపంలోని ఓ చెరువులో నీళ్ల రంగు సడన్‌గా మారిపోయింది. నీళ్లన్ని గులాబీ రంగులో దర్శనమిచ్చాయి. దాంతో స్థానికులు అది దేవుడి లీలగా బావించి మొక్కులు చెల్లించుకున్నారు‌ కూడా. నిపుణులు మాత్రం ఇది రసాయనిక చర్యగా భావించి.. ఆ నీటిని తాకకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మహారాష్ట్రలోను ఇలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. బుల్దానా జిల్లాలోని లోణార్ చెరువులో నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయాయి. ఆ చెరువు ముంబైకి కేవలం ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా… 383 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గులాబీ రంగులో మారడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. నాగ‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధికారులు ఆ చెరువును పరిశోదించి… ఓ రకమైన బాక్టీరియా కారణంగా ఇలా జరిగి‌ందని తేల్చారు.

అటు అమెరికాలోను ఇలాంటి ఘటనే చోటు‌చేసుకుంది. అమెరికాలోని హవాయిలోని ఓ చెరువులో నీళ్లు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన ‘ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌’.. చెరువులో అధిక లవణీయత ఉన్న నీటిలో కనిపించే బాక్టీరియా కారణంగా నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయి ఉంటాయని భావించారు. కరవు కారణంగా జూన్‌ నుంచి చెరువులో నీరు ఆవిరి కావడంవల్ల లవణీయత పెరిగి ఉంటుందని… నీరు విషపూరితం కాలేదని, రంగు మార్పుపై స్పష్టత కోసం నమూనాలు సేకరించి హవాయీ విశ్వవిద్యాలయనికి పంపించామని తెలిపారు. కాగా, ఉన్నట్టుండి చెరువులోని నీళ్లు గులాబీ రంగులో మారడంతో ఆశ్చర్చపోయిన ఓ వ్యక్తి.. డ్రోన్‌ సాయంతో ఆ చెరువు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అప్పట్లో ఆ ఘటన సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా నీళ్లు గులాభీ రంగులోకి మారడానికి హలో బ్యాక్టీరియా కారణమని. ఇది ఏకకణ జీవి అని, దాని పెరుగుదల కారణంగానే నీళ్లు ఇలా గులాబీ రంగులోకి మారుతాయని… ఇవి అధిక లవణీయత పరిస్థితులలో వృద్ధి చెందుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఇది నిజమేనని ధృవీకరించేందుకు DNA పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని.. హలోబ్యాక్టీరియానే కారణమా కాదా అన్నది తేల్చాల్సి‌ ఉందని అమెరికా శాస్త్ర వేత్తలు చెపుతున్నారు.

చూడాలి అక్కడెక్కడో  ఆకాశం గులాబీ రంగులోకి మారి ప్రపంచాన్ని షాక్ గురి చేసిన ఘటనకు చెన్నూరు లో బోర్ నుండి ఏకదాటిగా గులాబీ దారలా వస్తున్న నీటికి సంబందం ఉందా..? బాక్టీరియా కారణంగానే ఇలా నీరు గులాబీ రంగులోకి మారుతుందా అన్నది తేలాల్సి‌ఉంది. అప్పటి వరకు మాత్రం ఆ నీటిని వినియోగించక పోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు‌. మన భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు.. అప్పుడప్పుడు ఇలా ఎవ్వరూ ఊహించని పరిణామాలు వెలుగు చూస్తుంటాయి అంతే.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!