Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వామ్మో.. స్టీరింగ్‌ కూడా అందని బుడ్డొడు.. కారును పరుగులు పెట్టిస్తున్నాడు..! చూస్తేగానీ, నమ్మలేరు..

బిడ్డ పుట్టిన వెంటనే అక్కడి ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుందేమో..అంటూ మరోక వినియోగదారు వ్యాఖ్యనించారు. పిల్లలకు కారు ఇవ్వడం ప్రమాదకరమని ఒక వినియోగదారు అంటుంటే.. ఇదంతా చూసిన మరో యూజర్‌ ఆందోళనగా.. ఆ చిన్నారిని చంపాలనుకుంటున్నారా ఏంటీ.. అంటూ ప్రశ్నించారు. ఇది తల్లిదండ్రుల తప్పు అని, వాళ్లు ఇంతచిన్న పిల్లవాడికి కారు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Watch Video: వామ్మో.. స్టీరింగ్‌ కూడా అందని బుడ్డొడు.. కారును పరుగులు పెట్టిస్తున్నాడు..! చూస్తేగానీ, నమ్మలేరు..
Small Child Surprised
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 12, 2023 | 8:32 AM

సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి విషయం సంచలనం సృష్టిస్తుందో చెప్పలేం..ప్రతినిత్యం అనేక రకాల వార్తలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటివి చూసినప్పుడు నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మలేకపోతుంటారు. కొన్ని వీడియోలు ఆశ్చర్యంగానూ, మరికొన్ని ఆందోళకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు మనసు హత్తుకునేలా ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే..ఇది నిజంగా జరుగుతుందా అని ఎవరూ నమ్మలేకపోతుంటారు.? అలాంటి ఒక వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా నోరెళ్లబెట్టేస్తారు. ఇక్కడ ఒక బుడ్డొడు చేసిన పని ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఆ బుడతడు ఏం చేశాడో ఇక్కడ చూద్దాం..

వైరల్ వీడియోలో పెద్ద కారు డ్రైవింగ్ సీటుపై స్టిరింగ్‌ కూడా సరిగా అందని ఓ పిల్లవాడు కూర్చుని ఉండటం ముందుగా కనిపించించి. వీడియో చూస్తుంటే పిల్లాడు కారు డ్రైవ్ చేయబోతున్నాడనే అర్థమవుతుంది. సరిగ్గా అదే జరిగింది. బుడ్డొడు స్టిరింగ్‌ తిప్పుతూ కారు నడపడం ప్రారంభించాడు. రోడ్డుపై పిల్లవాడు వేగంగా కారు నడుపుతున్న దృశ్యాలను మనం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. వీడియోలో ఉన్న చిన్నారి ధైర్యాన్ని అభినందించాల్సిందే. పిల్లవాడు ఏ మాత్రం భయం లేకుండా కారును ఫుల్ స్పీడ్ గా నడుపుతున్నాడు. ఈ వీడియో ఎక్కడిది అనే సమాచారం మాత్రం వెల్లడి కాలేదు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ali zeynali_60 (@zeynali_60)

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు షేర్ చేశారు. ఆ వీడియోపై జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆ పిల్లవాడికి కారు నడపడానికి అనుమతి ఉందా..? అనే సందేహం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పుట్టిన వెంటనే అక్కడి ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుందేమో..అంటూ మరోక వినియోగదారు వ్యాఖ్యనించారు. పిల్లలకు కారు ఇవ్వడం ప్రమాదకరమని ఒక వినియోగదారు అంటుంటే.. ఇదంతా చూసిన మరో యూజర్‌ ఆందోళనగా.. ఆ చిన్నారిని చంపాలనుకుంటున్నారా ఏంటీ.. అంటూ ప్రశ్నించారు. ఇది తల్లిదండ్రుల తప్పు అని, వాళ్లు ఇంతచిన్న పిల్లవాడికి కారు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరికొందరు నెటిజన్లు మాత్రం బుడ్డొడి సహసాన్ని కొనియాడుతున్నారు. వావ్, చిన్న పిల్లవాడే కానీ, అద్భుతం చేసాడంటూ ప్రశంసించారు. ఇంతకీ, ఈ పిల్లవాడు కారు నడపడం ఎక్కడ నేర్చుకున్నాడు? అంటూ చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. వీడియోని మళ్లి మళ్లీ చూస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..