Sneezing: వరుస తుమ్ములు ఇబ్బంది పెడుతున్నాయా? ఈ హోం రెమెడీస్‌తో తగ్గించుకోండి!
తుమ్ములు అందరికి సాధారణం. అయితే చలికాలంలో కొందరికి ఒకేసారి అనేక తుమ్ములు వస్తాయి. వరుసగా వచ్చే తుమ్ములతో కొందరు తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. ఇది మన రోజువారీ పనిలో సమస్యలు కలిగిస్తుంది. వరుసపెట్టి వచ్చే తుమ్మల కారణంగా ఇతరులు కూడా ఇబ్బందిపడాల్సి వస్తుంది.. అందుకే మనం తుమ్ములను వదిలించుకోవడానికి మీకు సహాయపడే నివారణలను తెలుసుకుందాం..
Updated on: Dec 11, 2023 | 2:27 PM

మీకు తరచుగా తుమ్ములు వస్తుంటే చలికాలంలో చల్లటి నీళ్లు తాగడం మానేయండి. నీటిని ఎప్పుడు వెచ్చగా తాగాలి. ఇది కాకుండా, మీరు అల్లం టీ లేదా సూప్ వంటివి తాగొచ్చు. ఇది ముక్కులో అడ్డంకిని తెరుస్తుంది. తుమ్ముల సమస్యను కలిగించదు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరం కాస్త వేడెక్కుతుంది. దీంతోపాటు ఉదరానికి సంబంధించిన సమస్యలు కూడా మీకు దూరమవుతాయి.

అల్లం మరియు తేనె మిశ్రమం జలుబును నయం చేస్తుంది. తుమ్ములను కూడా ఆపుతుంది. అందుకోసం అల్లం ముక్కను మెత్తగా నూరి అందులోంచి రసాన్ని తీసి అందులో కొంచెం తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు తింటే తుమ్ముల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ద్రాక్షలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు రోజూ ద్రాక్షను తీసుకుంటే, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తుమ్ములను కూడా ఆపుతుంది. మీరు నిమ్మ, నారింజను కూడా ఉపయోగించవచ్చు.

ఆవిరి పట్టండి.. వేడి నీటి ఆవిరిని తీసుకోవడం ద్వారా కూడా తుమ్ములు రావడాన్ని ఆరికడుతుంది. దీని ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. తరచుగా వచ్చే తుమ్ముల సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధపెడుతుంటే, ఖచ్చితంగా రోజుకు ఒకసారి ఆవిరి పట్టాలని సూచిస్తున్నారు నిపుణులు.

నల్ల మిరియాలు అలర్జీ సమస్య ఉన్నవారు నల్లమిరియాలు తీసుకోవాలి. దీనికోసం కొద్దిగా నల్ల మిరియాల పొడిని తీసుకుని, తులసి ఆకులతో కలిపి నమలాలి. అలాకాకపోతే.. తులసి, నల్లమిరియాలతో చేసిన టీని కూడా తయారు చేసుకుని తాగవచ్చు.





























