- Telugu News Photo Gallery Do You Know The Benefits Of Ghee Coffee This Is How To Make It Telugu News
Benefits of Ghee Coffee : నెయ్యి కాఫీ అంటే ఏమిటి..? ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే మొదలుపెడతారు..
Benefits of Ghee Coffee : నెయ్యి కాఫీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ప్రస్తుతం ఈ కాఫీ బాగా ట్రెండ్ అవుతోంది. ఎందరో సినీమనటులు ప్రస్తుతం నెయ్యి కాఫీని ఇష్టంగా తాగుతారు. ఈ కాఫీ రుచిలో మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, తయారు చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Dec 11, 2023 | 2:14 PM

నెయ్యి కాఫీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. నెయ్యి కాఫీ చాలా రుచికరమైనది. ఆరోగ్యకరమైనది కూడా. ఇది బరువు తగ్గించేందుకు తోడ్పడుతుంది. పొట్టలోని యాసిడ్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.

ఎందుకంటే నెయ్యిలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఇది యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నెయ్యి కాఫీ వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.

నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ మరియు కె పుష్కలంగా ఉన్నాయి.

ఆకలిని తగ్గింస్తుంది. దీని వల్ల త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. మొండి కొవ్వులను కరిగించటంలో కూడ ఇది సహాయపడుతుంది.

నెయ్యి కాఫీ ఎలా తయారీ విధానం: ముందుగా కాఫీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. అది మరుగుతున్నప్పుడు అందులో నెయ్యి వేయాలి. మరికొంత సేపు కాగనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకోవాలి. దీంతో నెయ్యి కాఫీ తయారీ పూర్తయినట్లే..





























