- Telugu News Photo Gallery Cinema photos Heroine Shruti Haasan accept small roles in Tollywood hopes on prabhas salaar Telugu Actress Photos
Shruti Haasan: మెరుపుతీగ లాంటి పాత్రలకు ఓకే అంటున్న శృతి.. సలార్ పైనే అమ్మడి ఆశలు.
వరస సినిమాలు చేస్తున్నా.. శృతి హాసన్ మాత్రం మునపటి స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతున్నారా..? హీరోయిన్ అంటే కేవలం పాటలకు పరిమితం అయిపోతే చాలా..? రెండున్నర గంటల సినిమాలో కనీసం అరగంట కూడా అవసరం లేదా..? ఒక్కసారి వచ్చిపో మెరుపుతీగ అనే పాత్రలకే శృతి పరిమితం అవుతున్నారా.? స్టార్ హీరోలు ఛాన్సిస్తున్నా.. అసలవి ఆమె కెరీర్‌కు ఉపయోగపడతాయా..? ఓ వైపు చిరంజీవి.. మరోవైపు బాలయ్య సినిమాల్లో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుందని తెలియగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 11, 2023 | 2:22 PM

వరస సినిమాలు చేస్తున్నా.. శృతి హాసన్ మాత్రం మునపటి స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతున్నారా..? హీరోయిన్ అంటే కేవలం పాటలకు పరిమితం అయిపోతే చాలా..? రెండున్నర గంటల సినిమాలో కనీసం అరగంట కూడా అవసరం లేదా..? ఒక్కసారి వచ్చిపో మెరుపుతీగ అనే పాత్రలకే శృతి పరిమితం అవుతున్నారా..?

రీఎంట్రీ తరువాత కూడా గోల్డెన్ లెగ్ ఇమేజ్‌ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు శ్రుతి. క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రుతి, ఆ సినిమాతో రవితేజ ఫెయిల్యూర్స్‌కు బ్రేకేశారు. ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత డైలమాలో పడ్డ చిరు కూడా శ్రుతి హెల్ప్‌తో వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ అందుకున్నారు.

గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో వెంటనే మెగా కాపౌండ్ నుంచి శ్రుతికి మరో ఆఫర్ వచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు సినిమాలో హీరోయిన్‌గా నటించారు శ్రుతి. జంజీరా లాంటి భారీ డిజాస్టర్ తరువాత వచ్చిన ఎవడు, చరణ్ కెరీర్‌ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.

ఏదో చెప్పుకోడానికి రెండు సీన్స్.. మధ్యలో రెండు సాంగ్స్ మినహాయిస్తే వీరసింహారెడ్డి శృతి కెరీర్‌కు కించత్ కూడా యూజ్ అవ్వదేమో..? రెండేళ్ళ కింద వకీల్ సాబ్‌లోనూ అతిథి పాత్రే చేసారు ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ సినిమా అంటే గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటే.. వకీల్ సాబ్‌లో 15 నిమిషాల పాత్ర చేసారు శృతి.

వీటితో పోలిస్తే క్రాక్‌లో ఖతర్నాక్ కారెక్టర్ చేసారు శృతి హాసన్. కథలో ముఖ్యమైన పాత్రే కాదు.. ఫైట్స్ కూడా ఇరగదీసారు ఈ భామ. అయితే తాజాగా విడుదలైన హాయ్ నాన్నలో మరోసారి పరిస్థితి మొదటికి వచ్చింది.

గబ్బర్ సింగ్ సెంటిమెంట్‌ను గట్టిగా నమ్మిన పవర్ స్టార్.. రీ ఎంట్రీ విషయంలోనూ శ్రుతి హెల్ప్ తీసుకున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన వకీల్ సాబ్‌లో పవన్‌కు జోడిగా కనిపించారు శ్రుతి. ఒరిజినల్ వర్షన్‌లో హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయినా... రీమేక్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసి మరీ శ్రుతికి ఛాన్స్ ఇచ్చారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలోనూ శ్రుతి సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఇద్దరమ్మాయిలతో ఫెయిల్యూర్ తరువాత.. శ్రుతితో కలిసి నటించిన రేసుగుర్రం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బన్నీ.





























