గేమ్ చేంజర్ సెట్స్ మీద ఉండగానే గతంలో ఆగిపోయిన ఇండియన్ 2ను కూడా లైన్‌లో పెట్టారు శంకర్. రెండు సినిమాల షూటింగ్స్ ప్యారలల్‌గా ప్లాన్ చేసిన దర్శకుడు, ఇండియన్ 2 మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గేమ్ చేంజర్ మొదలైన చాలా రోజుల తరువాత పట్టాలెక్కిన ఇండియన్ 2 ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. రీసెంట్‌గా ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. అయినా గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో క్లారిటీ రాలేదు.