- Telugu News Photo Gallery Cinema photos Kalyan Ram to be seen in a new look in his movie Devil releasing on December 29th
Devil: రేసులోకి దిగిన “డెవిల్”.. కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
ఈ ఏడాది సలార్‌తోనూ, డంకీతోనూ పూర్తయిపోతుందనుకుంటే, నేనున్నానంటూ డెవిల్ రేసులోకి దూకేశాడు. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 29న ప్లేస్ ఫిక్స్ చేసుకుంది. టైమ్ తక్కువ ఉండటంతో ప్రమోషన్లలోనూ స్పీడ్ పెంచారు మేకర్స్. కల్యాణ్‌రామ్ గూఢచారిగా నటించిన మూవీ డెవిల్. పీరియడ్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకనిర్మాత అభిషేక్ నామా. బ్రిటిష్ టైమ్‌లో జరిగే కథ కావడంతో కాస్ట్యూమ్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Dec 11, 2023 | 9:37 PM

ఈ ఏడాది సలార్‌తోనూ, డంకీతోనూ పూర్తయిపోతుందనుకుంటే, నేనున్నానంటూ డెవిల్ రేసులోకి దూకేశాడు. అప్పుడెప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ 29న ప్లేస్ ఫిక్స్ చేసుకుంది. టైమ్ తక్కువ ఉండటంతో ప్రమోషన్లలోనూ స్పీడ్ పెంచారు మేకర్స్

కల్యాణ్‌రామ్ గూఢచారిగా నటించిన మూవీ డెవిల్. పీరియడ్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకనిర్మాత అభిషేక్ నామా. బ్రిటిష్ టైమ్‌లో జరిగే కథ కావడంతో కాస్ట్యూమ్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నారట మేకర్స్.

డెవిల్‌లో కల్యాణ్ రామ్ టోటల్‌గా 90 కాస్ట్యూమ్స్ ఉపయోగించారట. ఇటలీ నుంచి తెప్పించిన మొహైర్ ఊల్‌తో 60 బ్లేజర్స్ ని స్పెషల్‌గా తయారుచేయించారట కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్

డెవిల్‌లో ధోతి, కోటుతో కల్యాణ్‌రామ్ కనిపించే ప్రతి సన్నివేశంలోనూ భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాస్టూమ్ విషయంలో మాత్రమే కాదు, యాక్సెసరీస్ పరంగానూ స్పెషల్ కేర్ తీసుకున్నాం అని అంటున్నారు అభిషేక్ నామా.

బింబిసారలో రెండు గెటప్పుల విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకున్నారు కల్యాణ్‌రామ్. ప్రతి చిత్రంలోనూ లుక్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, కాస్ట్యూమ్స్ విషయంలో అంతే కేర్‌ఫుల్‌గా ఉంటారు నందమూరి హీరో. కాస్ట్యూమ్స్ విషయంలో ఆయనకున్న ఇంట్రస్ట్ ఇప్పుడు డెవిల్ విషయంలో మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు నెటిజన్లు.





























