Viral News: ఆ దేశంలో ఎక్కడ చూసినా నల్లులే.. బెడ్‌బగ్ స్కామ్‌తో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. ఒలింపిక్స్ నిర్వహణపై ఆందోళన
మోసగాళ్లు.. గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్‌ను పీడిస్తున్న నల్లుల భయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోసగాళ్లిద్దరూ ప్రజలను మంచాల నుండి రక్షించడానికి వ్యాక్సిన్‌ను ఇస్తున్నట్లు నటిస్తూ, కీటకాలను శరీరం నుండి దూరంగా ఉంచుతుందని వారు చెప్పే ఆయింట్‌మెంట్‌ను కూడా వారికి ఇస్తున్నారు. అయితే ఇంతలోనే కొందరు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులు కూడా అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
నల్లులు (బెడ్‌బగ్) ఇవి చిన్న జీవులు. అయితే ఇవి చాలా ప్రమాదకరమైనవి. రక్తం, ముఖ్యంగా మానవ రక్తం తాగి జీవిస్తాయి. బెడ్‌బగ్‌లు తరచుగా ఇళ్లలోకి లేదా మంచం, పరుపుల్లో ఎక్కువగా నివశిస్తాయి. నల్లులున్న మంచం మీద నిద్రపోవడం ఎవరి తరం కాదు.. వెంటనే ఆ బెడ్ బగ్స్ ను చంపెయ్యడానికి చూస్తారు. ప్రస్తుతం ఈ బెడ్‌బగ్స్ ఫ్రాన్స్ ప్రజల జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆ దేశంలో ‘బెడ్‌బగ్ స్కామ్’ మొదలైంది. ఇటీవల ఆ దేశ పోలీసులు బెడ్ బగ్ కుంభకోణానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఎదుటి వారికి ముఖ్యంగా వృద్ధులకు అవసరం లేనప్పటికి.. అధిక ధరలకు ‘బెడ్‌బగ్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్‌లను’ అమ్మడం ద్వారా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
నివేదికల ప్రకారం మోసగాళ్లు ఇద్దరూ బాధితుల ఇళ్లలోకి ప్రవేశించి వారికి నకిలీ నియంత్రణ సేవలను అందించి .. ఆపై తాము చేసిన సేవలకు అధిక ధరలు వసూలు చేసేవారు. బాధితుల నుంచి 324 డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 27 వేల నుంచి.. 2265 డాలర్లు అంటే దాదాపు లక్షా 89 వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు స్ట్రాస్‌బర్గ్ పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు మోసగాళ్లు కనీసం 48 సార్లు మోసం చేసినట్లు తెలుస్తోంది. అయినా తొమ్మిది అధికారిక ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.
నల్లుల భయాన్ని క్యాష్ చేసుకున్న దుండగులు
నిజానికి మోసగాళ్లు.. గత కొన్ని రోజులుగా ఫ్రాన్స్‌ను పీడిస్తున్న నల్లుల భయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోసగాళ్లిద్దరూ ప్రజలను మంచాల నుండి రక్షించడానికి వ్యాక్సిన్‌ను ఇస్తున్నట్లు నటిస్తూ, కీటకాలను శరీరం నుండి దూరంగా ఉంచుతుందని వారు చెప్పే ఆయింట్‌మెంట్‌ను కూడా వారికి ఇస్తున్నారు. అయితే ఇంతలోనే కొందరు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు అధికారులు కూడా అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలి ఇంటి నుంచి బయటకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఫ్రాన్స్ అంతటా నల్లుల బెడద
ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రస్తుతం ‘బెడ్‌బగ్స్’ సంక్షోభంతో పోరాడుతోంది. ఇది యావత్ దేశాన్ని ప్రభావితం చేసింది. మొన్నటి వరకు జోక్ గా తీసుకున్న ఈ నల్లులు వివాదాస్పద రాజకీయ అంశంగా మారింది. ఫ్రెంచ్ రైళ్లు, పారిస్ మెట్రో, సినిమా థియేటర్‌ల వరకు దేశంలో అన్ని ప్రాంతాల్లో నల్లులు వ్యాపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆందోళన చెంతుంది. తమ దేశంలో 2024 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ఆందోళన చెందుతుంది. అయితే నల్లుల సమస్యకు స్వస్తి చెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..