AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Year in Search 2023: 2023లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలు ఏమిటో తెలుసా..!

2023 లో గూగుల్ లో వార్తలు, క్రీడలు, పాటలు ఇలా ఏఏ విభాగాల్లో ఏఏ విషయాలు ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిని చూపించారో ఈ రోజు తెలుసుకుందాం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, మునిగిపోయిన టైటానిక్‌ సందర్శనకు వెళ్లిన టైటానిక్ జలాంతర్గామి అదృశ్యం, టర్కీలో బీభత్సాన్ని సృష్టించిన భూకంపాలు ఈ సంవత్సరం జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు. ప్రతి సంవత్సరం, Google ' Google ఇయర్ ఇన్ సెర్చ్'ని విడుదల చేస్తుంది.

Google Year in Search 2023: 2023లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలు ఏమిటో తెలుసా..!
Google Year In Search 2023
Surya Kala
|

Updated on: Dec 12, 2023 | 4:07 PM

Share

మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. నూతన సంవత్సరం 2024 కు వెల్కమ్ చెప్పనున్నాం.. ఈ నేపథ్యంలో 2023 ఏడాదిలో జరిగిన మంచి చెడుల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో 2023 లో గూగుల్ లో వార్తలు, క్రీడలు, పాటలు ఇలా ఏఏ విభాగాల్లో ఏఏ విషయాలు ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిని చూపించారో ఈ రోజు తెలుసుకుందాం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, మునిగిపోయిన టైటానిక్‌ సందర్శనకు వెళ్లిన టైటానిక్ జలాంతర్గామి అదృశ్యం, టర్కీలో బీభత్సాన్ని సృష్టించిన భూకంపాలు ఈ సంవత్సరం జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలు. ప్రతి సంవత్సరం, Google ‘ Google ఇయర్ ఇన్ సెర్చ్’ని విడుదల చేస్తుంది. ఇది వ్యక్తులు వారి Google శోధన బార్‌లలో టైప్ చేసిన అత్యధికంగా శోధించిన ప్రశ్నలను చూపుతుంది. ఇజ్రాయెల్‌లో యుద్ధం నుండి టర్కీలో భూకంపాల వరకు 2023లో ప్రజలు Googleలో ఎక్కువగా శోధించిన అంశాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి.

గూగుల్ గ్లోబల్ డేటా ప్రకారం.. 2023లో అక్టోబర్ లో మొదలై.. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. వార్తల్లో ట్రెండ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు జూన్‌లో టైటానిక్ శిధిలాలను చూడడానికి వెళ్లిన సబ్‌మెర్సిబుల్ మునిగిపోవడం, ఫిబ్రవరిలో టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి సృష్టించిన బీభత్సం భూకంపానికి సంబంధించిన వార్తలు కూడా ట్రెండింగ్ లో నిలిచాయి.

ఈ సంవత్సరం శోధనలో Google టాప్ ట్రెండింగ్ వ్యక్తి డామర్ హామ్లిన్. 2023 ప్రారంభంలో ఒక తీవ్రమైన స్నోప్ లో ప్రమాదం నుండి బయటపడిన నటుడు జెరెమీ రెన్నర్ కోసం కూడా ప్రజలు శోధించారు. అదే సమయంలో ప్రజలు దివంగత మాథ్యూ పెర్రీ , టీనా టర్నర్ కోసం ఎక్కువగా సెర్చ్ చేశారు.

ఇవి కూడా చదవండి

చలన చిత్ర పరిశ్రమకు చెందిన రంగంలో ఈ సంవత్సరం గూగుల్ సెర్చ్ మూవీ ట్రెండ్‌లలో “బార్బీ” ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత “ఓపెన్‌హైమర్”, “జవాన్” సినిమా ఉన్నాయి. బుల్లి తెరపై ప్రసారం అయిన “ది లాస్ట్ ఆఫ్ అస్,” “వెడ్నెస్ డే” , “గిన్నీ అండ్ జార్జియా” ఈ మూడు షోలు 2023లో ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయి.

Yoasobi  “イタード (ఐడల్)” Google శోధనలో అగ్ర ట్రెండింగ్ పాట. జాసన్ ఆల్డియన్ “ట్రై దట్ ఇన్ ఎ స్మాల్ టౌన్” వివాదం తర్వాత టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.  కొరియన్ స్పెషల్ ఫుడ్ “బిబింబాప్” టాప్ ట్రెండింగ్ రెసిపీ. ఇంటర్ మయామి CF, అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనెల్ మెస్సీకి చెందిన కొత్త ఇల్లు  క్రీడా విభాగంలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Google కి చెందిన “ఇయర్ ఇన్ సెర్చ్” ద్వారా వ్యక్తులు లేదా స్థలాలకు చెందిన సమాచారాన్ని గడిచిన సంవత్సరాలకు సంబంధించిన ట్రెండింగ్ వార్తలతో సహా ఏ విధమైన డేటాను అయినా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఏడాది టాప్ ట్రెండింగ్ కు సంబంధించిన విషయాలను 2023  జనవరి 1 నుండి నవంబర్ 27 వరకు సెర్చ్ చేసిన విషయాల ద్వారా ప్రకటించినట్లు గూగుల్ సంస్థ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..