Viral Video: మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల..ఈ క్షణమే ముఖ్యం అంటూ హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్..

అడవికి రారాజు సింహాలను క్రూరమైన, భయంకరమైన వేటగాళ్ళుగా పరిగణిస్తారు. అదే సమయంలో నీటిలో నివసించే మొసలి కూడా ఇలాంటి కౄరమైన జంతువే. మొసలి బారిన పడిన జంతువు జీవితం ఇక పూర్తి అయ్యినట్లు పరిగణిస్తారు. తాను చావుముంగిట ఉన్నా.. మరొక జీవికి ఆహారంగా మారబోతున్నా అసలు ఆ విషయం ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా తనకు అందిన ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే..? ఇది చదవడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా నిజం.

Viral Video: మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల..ఈ క్షణమే ముఖ్యం అంటూ హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్..
Monkey Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 09, 2023 | 12:32 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ ఇంటర్నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.  వీటిని ప్రజలు చూడటమే కాకుండా తన స్నేహితులకు ,బంధువులకు వాటిని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా అడివిలో జంతువులకు సంబంధించిన వీడియోలు చూస్తే కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. అదే విధంగా కొన్ని జీవులు తమ ఆకలి తీర్చుకోవడానికి ఆరాటపడుతుంటే.. మరికొన్ని జీవులు జీవితంచడానికి పోరాడుతూ ఉంటాయి. వేటగాడు ఆకలి తీర్చుకోవడానికి ఎర కోసం వెతుకుతున్న చోట.. ఆ ఎర వేటగాడి నుంచి ఎప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే చాలా సార్లు జంతువులు తాము చేసే పొరపాటు వల్ల వేటగాడి చేతికి చిక్కుకుపోతుంది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అడవికి రారాజు సింహాలను క్రూరమైన, భయంకరమైన వేటగాళ్ళుగా పరిగణిస్తారు. అదే సమయంలో నీటిలో నివసించే మొసలి కూడా ఇలాంటి కౄరమైన జంతువే. మొసలి బారిన పడిన జంతువు జీవితం ఇక పూర్తి అయ్యినట్లు పరిగణిస్తారు. తాను చావుముంగిట ఉన్నా.. మరొక జీవికి ఆహారంగా మారబోతున్నా అసలు ఆ విషయం ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా తనకు అందిన ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటే..? ఇది చదవడానికి మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది పూర్తిగా నిజం. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

కోతి పిల్ల మొసలి నోటిలో చిక్కుకున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఈ క్లిప్‌లోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కోతి మొసలి నోటి నంచి విడిపించుకుని ప్రయత్నం చేయడం లేదు.. అంతేకాదు అసలు తనకు మరణంతో సంబంధం లేదు.. ఇప్పుడు ఈ క్షణం మాత్రమే ముఖ్యం అన్నట్లు  నిర్భయంగా తనకు అందుతున్న ఆహారాన్ని తినడం మొదలు పెట్టింది. ఈ వీడియో చూసి చిన్నారి కోతి నిర్భయాన్ని ప్రశంసిస్తున్నారు.

అయితే ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ వీడియోను lendra.novero అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేసారు. మూడు లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసి, కామెంట్ చేస్తూ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒకరు మొసలి నిద్ర లేస్తే.. ఇక కోతికి తప్పించుకునే అవకాశం ఇవ్వదు అని కామెంట్ చేయగా.. మరొకరు ఇది విరుద్ధమైన తెలివితేటలు అంటారు’ అని రాశారు.  అంతేకాదు చాలామంది రకరకాల కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..