Longest Train Travel: ఒకే రైలు ప్రయాణంలో 3 దేశాలు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్లో 8 రోజులు ఎంచక్కా..

మీకు రైలు ప్రయాణం అంటే ఇష్టం ఉన్నా? ముఖ్యంగా రైలులో విదేశాలకు వెళ్లేటపుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రత్యేక రైలు తప్పక నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం. ప్రత్యేకత ఏమిటంటే ఈ రైలు మూడు దేశాలను కవర్ చేస్తుంది. ట్రాన్స్-సైబీరియన్ రైల్వే నెట్‌వర్క్‌గా పిలువబడే ఈ రైలు 3 దేశాలకు ప్రయాణిస్తుంది.

Longest Train Travel: ఒకే రైలు ప్రయాణంలో 3 దేశాలు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్లో 8 రోజులు ఎంచక్కా..
Worlds Longest Train Journe
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2023 | 12:38 PM

మీరు ప్రయాణ ప్రేమికులైతే, మీరు రైలులో ప్రయాణన్నే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే.. రైలు ప్రయాణం అనేది కుటుంబ సమేతంగా, ఒంటరిగా కూడా వెళ్లేందుకు సరైన మార్గం..? తక్కువ బడ్జెట్‌తో ప్రయాణించాలనుకునే వారికి రైలు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గం. అయితే మీరు ఒకే రైలులో 3 దేశాలకు ప్రయాణించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం మూడు దేశాలకు విస్తరించి ఉంది. మీరు ఈ మూడు దేశాలను కవర్ చేయాలనుకుంటే వారం పాటు మీరు రైల్లో గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే. ఇది దాదాపు 8 రోజుల రైలు ప్రయాణం కాబట్టి.

మీకు రైలు ప్రయాణం అంటే ఇష్టం ఉన్నా? ముఖ్యంగా రైలులో విదేశాలకు వెళ్లేటపుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రత్యేక రైలు తప్పక నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం. ప్రత్యేకత ఏమిటంటే ఈ రైలు మూడు దేశాలను కవర్ చేస్తుంది. ట్రాన్స్-సైబీరియన్ రైల్వే నెట్‌వర్క్‌గా పిలువబడే ఈ రైలు 3 దేశాలకు ప్రయాణిస్తుంది. మొత్తం 10,214 కి.మీ. ఈ రైలు రష్యా రాజధాని మాస్కో నుండి తూర్పు నగరమైన వ్లాడివోస్టాక్‌కు వెళుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైలు ప్రయాణంగా పేరుగాంచింది. ఎందుకంటే ఇంత సుదీర్ఘ ప్రయాణం ఏ దేశంలోనూ రైలులో చేయలేము. ఈ సుదీర్ఘ రైలు ప్రయాణానికి 7 రోజుల 20 గంటల 25 నిమిషాల సమయం పడుతుందని తెలిస్తే మీరు మరింత ఆశ్చర్యపోవాల్సిందే. రవాణా చరిత్రలో రైలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ రైలు నిర్మాణం 1891లో ప్రారంభమైంది. ఇది పూర్తి చేయడానికి మొత్తం 25 సంవత్సరాలు పట్టింది. 1916లో పూర్తయిందని సమాచారం. ఇక,ఈ రైలు మాస్కో – వ్లాడివోస్టాక్, మాస్కో – ఉలాన్‌బాతర్, మాస్కో – బీజింగ్‌తో సహా 3 దేశాల గుండా వెళుతుంది. దీని మార్గంలో 18 స్టేషన్లు ఉన్నాయి. అందులో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడ దిగాలనేది ముందుగా నిర్ణయించుకోవాలి. తర్వాత రూట్ ప్రకారం వీసా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మీరు రష్యా నుండి మీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టయితే.. మీరు చైనాకు వెళ్లాలనుకుంటే దీని కోసం మీరు రష్యా, చైనా కోసం వీసా కొనుగోలు చేయాలి. అలాగే, టిక్కెట్లను మాస్కో రైల్వే స్టేషన్‌లో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. మాస్కో నుండి వ్లాడివోస్టాక్ వరకు మూడు రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ రైలు ధర 175 డాలర్లు అంటే భారతీయులకు రూ. 13,982. దీని తరువాత, మరొక రూట్ టిక్కెట్ ధర $ 213 అంటే రూ. 17018. అలాగే, రైలులో మీరు ఎయిర్ కండిషనింగ్, రెస్టారెంట్, బెడ్, బార్, సీటులో సౌండ్ సిస్టమ్ మొదలైనవి పొందుతారు. ఒక ప్రైవేట్ లగ్జరీ గది కూడా అందుబాటులో ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..