- Telugu News Photo Gallery World’s Most Expensive Coffee, Made From Poop Of Civet Cat, To Be Produced In India Telugu News
ఈ అడవి జంతువు మలంతో తయారు చేసిన కాఫీకి ఫుల్లు డిమాండ్.. ఖరీదు కూడా ఎక్కువే..ఎందుకంటే..
'కాఫీ' పేరు వినగానే మనసుకు తాజాదనం, శక్తి వస్తుంది. టీ లాగానే ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు కూడా కొదవలేదు. చాలామంది తమ రోజును కాఫీతో ప్రారంభిస్తారు. కొంతమంది కాఫీకి ఎంతగా అలవాటు పడ్డారంటే.. కప్పు కాఫీ కోసం వేల రూపాయలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతారు. చాలా ఆనందంగా డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ కప్పు కాఫీ తాగుతుంటారు. ఎందుకంటే ఇది అత్యంత రుచికరమైనది. ఎంతో పోషకమైనది కూడా.
Updated on: Dec 09, 2023 | 9:11 AM

అయితే ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ ఏంటో తెలుసా? ఇది చాలా ఖరీదైనది. కానీ, దానిని తయారుచేసిన విధానం తెలిస్తే మాత్రం తాగడానికి చాలా కష్టం. ఈ రోజు మనం ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన, ఖరీదైన కాఫీ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పేరు 'కోపి లువాక్'. దీనిని సివెట్ కాఫీ అని కూడా అంటారు. ఇది సివెట్ లేదా పునుగు పిల్లి మలంతో తయారు చేస్తారు.

Kopi Luwak Coffee : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ 'కోపి లువాక్' దీన్ని సివెట్ కాఫీ అని కూడా అంటారు. అమెరికాలో ఒక్క కప్పుకాఫీకి దాదాపు రూ. 6 వేలు ఉంటుంది. సౌదీ అరేబియా, దుబాయ్, యూఎస్, యూరప్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి మంచి డిమాండ్ ఉంది. ఈ కాఫీ 1కేజీ ధర రూ. 20 నుంచి 25 వేల వరకు ఉంటుంది.

జంతువుల మలంలో ఇంత పోషకాహారం ఉంది అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారా? ఐతే దీనికి సమాధానం తెలియాలంటే 'కోపి లువాక్' తయారు చేసే విధానం అర్థం చేసుకోవాలి.

సివెట్ పిల్లులు కాఫీ గింజలను తినడానికి ఇష్టపడతాయి. కానీ పిల్లులు చెర్రీ గుజ్జును పూర్తిగా జీర్ణించుకోలేవు. దీనికి కారణం వాటి పేగులలో జీర్ణ ఎంజైమ్‌లు ఉండవు. అందువలన, కాఫీ ఆ భాగం పిల్లి మలంతో బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని శుద్ధి చేస్తారు. అన్ని రకాల సూక్ష్మజీవులు తొలగిపోయేలా చర్యలు తీసుకుంటారు. పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత తదుపరి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ గింజలు కడిగి కాల్చిన తర్వాత కాఫీ తయారు చేస్తారు.

ఈ కాఫీ భారతదేశంలోని కర్ణాటక (కొడగు) జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. ఆసియా దేశాలలో, ఇండోనేషియాలో ఇది పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేస్తారు. ఈ కాఫీ కిలో 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుంది.

అమెరికాలో ఇది ఒక్క కప్పుకాఫీకి దాదాపు 6 వేల రూపాయలుగా ఉంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, దుబాయ్, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో సివెట్ కాఫీకి డిమాండ్ ఉంది.





























