- Telugu News Photo Gallery Technology photos Samsung launching new laptop with Artificial intelligence Samsung galaxy book 4 features
Samsung: సామ్‌సంగ్ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో ఏఐ టెక్నాలజీ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ అధునాతన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఇందులో...
Updated on: Dec 08, 2023 | 10:01 PM

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనుంది. గ్యాలక్సీ బుక్ 4 పేరుతో మార్కెట్లోకి త్వరలోనే ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది.

డిసెంబర్ 15న గ్లోబల్ మార్కెట్లో ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఇంటెల్ కోర్ అల్ట్రా 7155H చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. అత్యంత వేగవంతమైన పనితీరుతో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుండానే అనేక పనులు చేయడం ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత.

సామ్‌సంగ్ గ్యాలక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్‌కు సామ్‌సంగ్ గాస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందించనున్నారు. ఈ ల్యాప్ సీపీయూలో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్‌ను అమర్చుతారు. దీంతో AI పనులను వేగంగా చేస్తుంది.

ఇక ఇందులో 32 GB వరకు RAM, 1TB వరకు ఆన్-బోర్డ్ స్టోరేజ్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం, దీనిలో ఎంచుకున్న మోడల్‌లను బట్టి NVIDIA GeForce RTX 4050 GPUని ఇవ్వనున్నారని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలను కంపెనీ ప్రకటించనుంది.





























