- Telugu News Photo Gallery Technology photos Realme launches new smart phone Realme gt 5 pro features and price details
Realme gt 5 pro: రియల్‌మీ నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం చైనాలో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు. రిలయ్‌మీ జీటీ 5 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీ కోసం..
Updated on: Dec 08, 2023 | 9:26 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీ5 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా, త్వరలోనే భారత్‌లో తీసుకురానున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఆడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్‌ను ఇవ్వనున్నారు. ఇక స్క్రీన్ విషయానికొస్తే 6.78 ఇంచెస్‌తో కూడిన 1.5కే కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు.

4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. పంచ్ హోల్‌తో కూడిన 32 మెగాపిక్సెల్స్ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో సోనీ ఎల్‌వైటీ-808తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్లేబిలైజేషన్‌ను ఇచ్చారు.

కెమెరా విషయానికొస్తే.. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐపీ64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు.

ఇక రియల్‌మీ జీటీ5 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే 5400 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ధర విషయానికొస్తే.. రూ. 46,900కాగా, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,400గా ఉండనుంది.





























