- Telugu News Photo Gallery Technology photos Infinix launching new smart phone Infinix Smart 8 HD features and price details
Infinix Smart 8 HD: రూ. 5,600కే సూపర్ స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..
హాంగ్‌కాంగ్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లను అందిస్తున్నారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 5,699కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు అందించారు.? ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 08, 2023 | 6:13 PM

ఇన్‌ఫినిక్స్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ చేసిన స్మార్ట్ 7 హెచ్‌డీకి కొనసాగింపుగా స్మార్ట్ 8 హెచ్‌డీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ డిసెంబర్ 13వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇందులో పంచ్ హోల్ కెమెరాను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా కోర్ టీ606 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 హెచ్‌డీ స్మార్ట్ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ కెపాసిటీని అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. డ్యూయల్ 4జీ వోల్ట్, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 6,299గా ఉండగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 5,669కే సొంతం చేసుకోవచ్చు.





























