- Telugu News Photo Gallery Technology photos Whatsapp introduced new feature for voice message as view once
Whatsapp: వాట్సాప్‌లో మరో హైలెట్ ఫీచర్.. ఇకపై వాయిస్ మెసేజ్‌లకు కూడా ఆ ఆప్షన్
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడ కొంగొత్త ఫీచర్లున తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఇక ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..
Updated on: Dec 13, 2023 | 5:32 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేసే క్రమంలో ఎన్నో కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో సూపర్ ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఎదుటి వారికి పంపిన ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ ఒక్కసారి చూడగానే దానంతట అదే డిలీట్ అయ్యేలా 'వ్యూ వన్స్' ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో అవతలి వ్యక్తులు మీరు పంపిన మెసేజ్ చూడగానే వారి ఫోన్‌లో ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంది.

అయితే ఇప్పటి వరకు టెక్ట్స్, ఫొటోలు, వీడియోలకే పరిమితమైన ఈ ఫీచర్‌ను వాట్సాప్ తాజాగా వాయిస్ మెసేజ్‌లకు కూడా తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ సహాయంతో మీరు అవతలి వ్యక్తికి పంపిన వాయిస్ మెసేజ్ వారు వినగానే వెంటనే డిలీట్ అవుతుంది. దీనికోసం 'వన్ టైమ్' పేరుతో ఫీచర్‌ను తీసుకొచ్చింఇద.

సున్నితమైన సమాచారాన్ని అందించే సమయం, లేదా మీరు పంపిన వాయిస్ మెసేజ్‌లు మరెవరికీ పంపించకుండా ఉండడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సాప్ చెబుతోంది. ప్రస్తుతం ఎంపిక చేసిన కొందరు యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాగా త్వరలోనే అందరికీ తేనున్నారు.




