- Telugu News Photo Gallery Technology photos Youtube introduces new feature that can pause comments for video creators
Youtube: యూట్యూబ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. కామెంట్స్‌ను నియంత్రించేందుకు..
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను వీక్షించేవారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త ఫీచర్ల కారణంగానే రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది యూట్యూబ్..
Updated on: Dec 09, 2023 | 9:50 PM

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది వినియోగదారులకు కాకుండా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వీడియోల కింద వచ్చే కామెంట్స్ కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

సాధారణంగా యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసే క్రియేటర్స్ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో కామెంట్స్ ఒకటి. కొన్ని సందర్భాల్లో కామెంట్స్‌తో క్రియేటర్స్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కంటెంట్ విషయంలో కొందరు యూజర్లు అభ్యంతరకర కామెంట్స్ చేసే సందర్భాలను చూస్తునే ఉంటాం.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూబ్యూట్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో క్రియేటర్స్ తమ వీడియోల క్రింద వచ్చే కామెంట్లను పాజ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని యూట్యూబ్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేసింది.

ఇంతకుముందు యూట్యూబ్ వీడియోలకు వచ్చే కామెంట్ల విషయంలో రెండు ఆప్షన్లు మాత్రమే ఉండేవి, మొదటిది కామెంట్లను పూర్తిగా నిలిపివేయడం,రెండోది పబ్లిష్ చేయడం. మధ్యలో కామెంట్లను ఆపడానికి ఎలాంటి ఆప్షన్ ఉండేది కాదు.

కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో మధ్యలో కామెంట్స్‌ను పాజ్ చేసే అవకాశం లభించనుంది. దీంతో అప్పటి వరకు వచ్చిన పాత కామెంట్స్ అలాగే ఉంటాయి. కానీ కొత్తవి మాత్రం కనిపించవు. క్రియేటర్స్‌కు తమ వీడియోలపై పూర్తి నియంత్రణను అందించడానికి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు.




