Venezuela-Guyana: ఇండియా.. ప్లీజ్ హెల్ప్.. మీరే మాకు దిక్కు! యుద్ధం వస్తే మా తరపున నిలవండి

దక్షిణ అమెరికా ఖండంలో అదొక చిన్న దేశం. ఇప్పుడు ఓ పెద్ద సమస్యలో చిక్కుకుంది. అది ఎంత పెద్దది అంటే.. పొరుగుదేశంతో దాదాపు యుద్ధాన్ని ఎదుర్కోవాల్సినంత పెద్దది. కానీ ఒంటరిగా యుద్ధం చేసే పరిస్థితి లేదు. అందుకే పెద్ద రాజ్యాల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఆధునిక ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగిన 'భారత్' వారికి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. పెద్దన్న పాత్ర పోషించి తమను ఆ పెద్ద సమస్య నుంచి గట్టెక్కించాలని కోరుతోంది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల కంటే 'భారత్' సహాయాన్ని కోరడం వెనుక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. ఆ దేశ జనాభాలో భారత మూలాలు కలిగిన ప్రజలున్నారు. ఆ దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఇద్దరూ భారత మూలాలు కలిగినవారే. పైగా దశాబ్దాలుగా భారత్‌తో సహృద్భావ సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచం ఉక్రెయిన్ - రష్యా, ఇజ్రాయిల్ - పాలస్తీనా యుద్ధాలను చూస్తుండగా.. కొత్తగా యుద్ధ వాతావరణం తలెత్తిన ఆ దేశం కథ ఏంటి?

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 09, 2023 | 3:07 PM

 చమురు నిల్వలపై కన్ను: దక్షిణ అమెరికా ఖండం ఉత్తర భాగాన ఉన్న చిన్న దేశం 'గయానా' ఇప్పుడు పొరుగుదేశం 'వెనిజ్యులా'తో యుద్ధ భయాన్ని ఎదుర్కొంటోంది. ఇందుక్కారణం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనిజ్యులా తమ దేశ సరిహద్దులకు ఆనుకున్న గయానాలోని 'ఎసెక్విబో' ప్రాంతంపై కన్నేయడమే. దశాబ్దాలుగా ఆ ప్రాంతం తమదే అని వాదిస్తున్న వెనిజ్యులా ఇప్పుడు ఏకంగా యుద్ధానికి సన్నద్ధమైంది. తమ దేశంలో ఏకంగా రిఫరెండం నిర్వహించి మరీ దేశ ప్రజల్లో జాతీయ భావనను రెచ్చగొట్టింది. 'ఎసెక్విబో'ను బలప్రయోగం చేసైనా సరే స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇంతకాలం 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్'లో కొనసాగుతున్న వివాదాన్ని యుద్ధం వైపు తీసుకెళ్లడానికి కారణం.. గయనాలోని 'ఎసెక్విబో' ప్రాంతం చమురు నిల్వలు సమృద్ధిగా కలిగి ఉండడమే. 2015 నుంచి ఇక్కడ జరిపిన అన్వేషణలో 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు బయటపడ్డాయి.

1 / 9
ప్రపంచంలో భారీ చమురు నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. వాటిని వెలికితీస్తే రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ దేశ భవిష్యత్తు ముఖచిత్రమే మారిపోతుంది. ఇన్నాళ్లుగా ఆ ప్రాంతం తమది అంటూ వాదిస్తూ వస్తున్న 'వెనిజ్యులా'కు ఈ సమాచారం మరింత ఆశను పెంచింది. 'ఎసెక్విబో'ను స్వాధీనం చేసుకుంటే తమ దేశ ఆర్థిక సంక్షోభాన్ని గట్టెక్కించడమే కాదు, అభివృద్ధిని పరుగులు తీయించవచ్చు అని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

2 / 9
ఇంతకీ ఎసెక్విబో ఎవరిది: గయానా భూభాగంలో సగం కంటే ఎక్కువ.. ఇంకా చెప్పాలంటే 2/3 వంతు భూభాగం కలిగిన ప్రాంతమే 'ఎసెక్విబో'. గయానాలో ఎసెక్విబో ప్రాంతాన్ని మిగతా దేశంలో 'ఎసెక్విబో' నది వేరు చేస్తుంది. ఈ ప్రాంతానికి వెనిజ్యులాతో పాటు బ్రెజిల్ దేశం సరిహద్దులు కలిగి ఉంది. వందేళ్లకు పైగా ఈ ప్రాంతం గయానాలోనే ఉంది. ఇప్పటికీ గయానాలో అంతర్భాగంగానే ఉంది. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతం తమది అంటూ వెనిజ్యులా వాదిస్తోంది. వలస పాలకుల సమయంలో వెనిజ్యులా, ఎసెక్విబో ప్రాంతాలను 'స్పెయిన్' పరిపాలించిందని చారిత్రక కారణాలను చూపుతోంది. "రెండు ప్రాంతాలను స్పెయిన్ పాలించినంత మాత్రాన ఆ భూభాగం మీదెలా అవుతుంది?" అంటూ గయానా కూడా గట్టిగానే వాదిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ న్యాయస్థానంలో కొనసాగుతోంది.

3 / 9
దురాక్రమణకు పన్నాగం: అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్న వివాదాన్ని అక్కడే తేల్చుకోకుండా 'ఎసెక్యుబో'ను సైనిక శక్తితో ఆక్రమించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో వెనిజ్యులా పాలకులు ఆ దేశంలో ఒక రెఫరెండం కూడా నిర్వహించారు. 'ఎసెక్విబో' తమదే అంటున్న ప్రభుత్వ వాదనపై ప్రజాభిప్రాయం కోరింది. ఆ ప్రాంతాన్ని తమ దేశంలో కొత్త రాష్ట్రంగా ఏర్పాటుచేయడంపై కూడా రెఫరెండంలో ప్రస్తావించింది. ప్రభుత్వ వాదనను సమర్ధించాలని దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రజలను కోరారు. అంతకు ముందు 'ఎసెక్విబో'ను ఆక్రమించుకుందాం అంటూ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. ఎసెక్విబో ప్రాంతంలో గయానా ఉపయోగించుకున్న జలాలను సైతం అడ్డుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన రెఫరెండం ఫలితాలను వెనిజ్యులా రెండ్రోజుల క్రితం విడుదల చేసింది. ప్రజల్లో 95% మంది ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని ఆ దేశం పేర్కొంది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వెనిజ్యులాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. తనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రజల్లో జాతీయ భావన రెచ్చగొట్టి యుద్ధకాంక్షను రగిల్చేందుకు నికోలస్ మదురో ప్రయత్నిస్తున్నారు. ఎసెక్విబో తమదే అని చెప్పడం ద్వారా ప్రజల్లో ఆయనకు ఆదరణ పెరుగుతోంది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా ఉన్న 'ఎసెక్విబో'ను ఆక్రమించుకుని దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ప్రయత్నాల్లో వెనిజ్యులా దేశాధ్యక్షుడు నికోలస్ మదురో యుద్ధానికి కాలుదువ్వుతున్నారు.

4 / 9
భారత్ వైపు గయానా చూపు: గయానాతో భారత్‌కు దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ద్వైపాక్షిక సంబంధాల్లో ఏ తేడా లేకుండా కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య సాంస్కృతికంగానూ దృఢమైన బంధం ఉంది. ఆ దేశ మొత్తం జనాభా 8 లక్షలు ఉంటే అందులో 3.5 లక్షల మంది భారత మూలాలు కలిగినవారే. దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, ఉపాధ్యక్షుడు భరత్ జగదేవ్ కూడా భారత మూలాలు కలిగినవారే. వెనిజ్యులాతో తలెత్తిన వివాదం విషయంలో ఆ దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తమ వాదన అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూ వచ్చారు. ఇప్పుడు వెనిజ్యులా కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. అయితే యుద్ధం అంటూ సంభవిస్తే అది ఇరుదేశాలకు నష్టం కల్గిస్తుంది. పైగా చిన్న దేశమైన గయానా వెనిజ్యులాతో పోరాడి గెలవడం కూడా సాధ్యం కాదు. అందుకే అగ్రరాజ్యాలను ఆశ్రయించి ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేలా వెనిజ్యులాపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. సరిగ్గా ఇక్కడే 'భారత్' కీలకంగా మారింది.

5 / 9
ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి అన్న విషయం తెలిసిందే. భారత్ అవసరాల్లో 80% దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇన్నాళ్లుగా చమురు కోసం మిడిల్-ఈస్ట్ దేశాలపైనే ఆధారపడుతూ వచ్చిన భారత్, ఈమధ్య సరికొత్త భాగస్వాములను వెతుక్కునే ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ సమయంలో రష్యాపై మిగతా ప్రపంచం అంతా ఆంక్షలు పెట్టి చమురు దిగుమతులను నిషేధించినప్పటికీ భారత్ వ్యూహాత్మకంగా ఆ దేశం నుంచి చవక ధరలకు చమురు కొనుగోలు చేసిన విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదే తరహాలో ప్రపంచవ్యాప్తంగా చమురు ఎగుమతి చేసే దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపరుచుకుంటూ తమ దేశ చమురు అవసరాలు తీర్చుకోవాలని చూస్తోంది.  ఈ క్రమంలో గయానా ఇప్పుడు భారత్‌కు తమ అవసరాలు తీర్చే సాధనంగా మారింది. ఆదేశంలో కనిపెట్టిన చమురు నిక్షేపాలను వెలికితీసే క్రమంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఆ దేశం కూడా చమురు నిక్షేపాలను వెలికితీసే విషయంలో భారత పెట్టుబడులను, సహకారాన్ని కోరుతోంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు 'భరత్ జగదేవ్' ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమకు భారత పెట్టుబడులతో పాటు నైపుణ్యం కల్గిన భారతీయ ఇంజనీర్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు.

6 / 9
భారత సంతతికి చెందిన అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు అక్కడి రాజకీయాల్లో కీలకస్థానాల్లో ఉన్న భారత మూలాలు కల్గిన నేతలు భారత్‌తో మెరుగైన, బలమైన సంబంధాలు కోరుకుంటున్నారు. భారత్ కూడా భారత మూలాలు కలిగిన ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన 'ప్రవాసి భారతీయ దివస్' కార్యక్రమానికి గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీని చీఫ్ గెస్టుగా ఆహ్వానించింది. ఆ దేశ అవసరాలు తీర్చే వస్తువులతో పాటు రక్షణ పరికరాలను కూడా భారత్ అందజేస్తోంది. ఎసెక్విబో ప్రాంతంలో గుర్తించిన చమురు నిక్షేపాల వెలికితీత ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన భారత్‌కు, వెనిజ్యులా దుష్టపన్నాగం విఘాతం కల్గిస్తుంది. అందుకే గయానా ఈ యుద్ధ భయం విషయంలో అమెరికాతో పాటు భారత్‌ను ఆశ్రయించి, యుద్ధం తలెత్తకుండా ఆపాలని కోరుతోంది.

7 / 9
ఇరకాటంలో భారత్‌: ఇదిలా ఉంటే భారత్‌కు వెనిజ్యులాతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశంపై అమెరికా ఆంక్షలు విధించే వరకు భారత్‌కు ఆ దేశం చమురు విస్తృతంగా ఎగుమతి చేసింది. ఇప్పుడు ఆంక్షలు సడలించిన తర్వాత మళ్లీ ఎగుమతి చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ పరిస్థితుల్లో వివాదాస్పద 'ఎసెక్యుబో' విషయంలో భారత్ అటు గయానాను సమర్థించలేక, ఇటు వెనిజ్యులానూ కాదనలేని సంకట స్థితిని ఎదుర్కొంటోంది. దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలన్న గయానా అభ్యర్థనపై భారత్ ఇప్పటి వరకు తన వైఖరి ఏంటో స్పష్టం చేయలేదు.  అయితే రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

8 / 9
ఉక్రెయిన్ - రష్యా, ఇజ్రాయిల్ - పాలస్తీనా (గాజా) విషయంలో ఎలాగైతే ఎవరికీ శత్రువు కాని వైఖరిని అవలంబింస్తుందో ఆ వైఖరి ఇక్కడ సాధ్యపడేనా? పైగా అడుగుతున్నది యుద్ధంలో సహాయం కాదు, దౌత్యపరమైన జోక్యమే కాబట్టి అడుగు ముందుకేస్తే వచ్చే నష్టమేంటి అన్న ప్రశ్నలు, విశ్లేషణలు వస్తున్నాయి. ఏదేమైనా భారత్ తన ప్రయోజనాలకు విఘాతం కలగకుండా మిత్రదేశాల ప్రయోజనాలు కాపాడేలా వ్యవహరించక తప్పదు.

9 / 9
Follow us
Latest Articles
చిక్కుల్లో నితీష్ తివారీ రామాయణం.
చిక్కుల్లో నితీష్ తివారీ రామాయణం.
ఏటీఎం నుంచి డబ్బులు తీస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..

ఆ స్టాక్స్‌లో పెట్టుబడితో అదిరే లాభాలు..ఏడాదిలోనే పెట్టుబడి డబుల్

లిక్కర్‌ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

ఢిల్లీకి ఉపాసనతో రామ్ చరణ్.. ఐఏఎస్ లుక్ అదిరిపోయింది

ఈ టిప్స్ పాటిస్తే.. మీ కారు పాతదైనా.. కొత్తగా పరుగులు పెడుతుంది..

మరో 2 రోజుల్లో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 ప్రిలిమినరీ 'కీ' విడుదల

సీఎం రేవంత్‌ రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఇంటర్వ్యూ

మైగాడ్‌.. అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి అదృశ్యం!

జంక్ ఫుడ్ తినడం ప్రాణాంతకం.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..