భారత్ – పాక్ మధ్య ఉన్న నదులు ఎన్ని.?
27 April 2025
Prudvi Battula
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు జల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది.
సింధు జల ఒప్పందం రావి, బియాస్, సట్లెజ్ అనే మూడు నదులను కవర్ చేస్తుంది. పాకిస్తాన్ కు సింధు నది చాలా ముఖ్యమైనది. కోట్లాది మందికి సింధు నది ఆధారం.
పాకిస్తాన్ లోని 80 శాతం సాగు భూమి దాని నీటిపై ఆధారపడి ఉంటుంది. 237 మిలియన్ల ప్రజల జీవనోపాధిలో సింధు నది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
సింధు నది మానససరోవర్ సరస్సు సమీపంలోని కైలాస పర్వత శ్రేణిలోని టిబెటన్ ప్రాంతంలోని బోఖర్ చు సమీపంలోని హిమానీనదం నుండి ఉద్భవించింది.
ఇది 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ మొత్తం పొడవుతో ప్రవహిస్తుంది. సింధు నది పాకిస్తాన్‌లో అతి పొడవైన నది.
సింధు నదీ పరీవాహక ప్రాంతంలోని 61 శాతం జనాభా పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. పాకిస్తాన్ నీటిపై నిషేధం కారణంగా ఆ దేశంలో సమస్యలు పెరగబోతున్నాయి.
పాకిస్తాన్ - భారతదేశం మధ్య మొత్తం 6 నదులు ప్రవహిస్తున్నాయి. భారత్ - పాక్ మధ్య జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, సింధు నదులు ప్రవహిస్తున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రేమికుల కోసం ఇన్స్టాలో సరికొత్త ఫీచర్!
కాశ్మీర్లో ఎన్ని ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి?
పులియ బెట్టిన పెరుగున్నంతో వేసవిలో అనారోగ్యం ఆమడ దూరం..