Honeymoon Destination: విదేశాల్లో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ఖర్చుతో ఈ దేశాలను విహరించవచ్చు..
హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న జంటలకు బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఈ విదేశాల్లో విహరించవచ్చు. ఈ ప్రదేశాలు అందంగా ఉండటమే కాదు.. మీకు తగిన బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ విదేశాలు హనీమూన్ కి మాత్రమే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ అందమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
పెళ్లి అయిన తర్వాత నవ దంపతులు హనీమూన్ జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం కోసం చూస్తారు. ప్రకృతి అందాల నముమ ప్రేమ పక్షుల్లా విహరించడానికి ఆసక్తిని చూపిస్తారు. విదేశాల్లో హనీమూన్ జరుపుకోవడానికి ఇష్టపడే జంటలు చాలా ఉంటాయి. అయితే తమ బడ్జెట్ కు అందుబాటులో లేకపోతే ఇష్టాన్ని పక్కకు పెట్టి తమ హనీమూన్ ప్రణాళికను రద్దు చేస్తారు. అయితే హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న జంటలకు బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ లో ఈ విదేశాల్లో విహరించవచ్చు. ఈ ప్రదేశాలు అందంగా ఉండటమే కాదు.. మీకు తగిన బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ విదేశాలు హనీమూన్ కి మాత్రమే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ అందమైన ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
మొరాకో: ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. ఇది ఆఫ్రికన్ ఖండంలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఎత్తైన పర్వతాలు, సహారా ఎడారిలోని అందాలను చూడకుండా ఉండలేరు. ఈ దేశంలోని మారకేష్, సహారా ఎడారి, కాసాబ్లాంకా, చెఫ్ చౌయెన్ , టాంజియర్ లను సందర్శించవచ్చు.
శ్రీలంక: మన పొరుగు దేశం శ్రీలంక కూడా అత్యంత సుందరమైన ప్రదేశము. ఇప్పటికే భారతీయులకు వీసా ప్రీని ప్రకటించింది. అంతేకాదు ఈ దేశంలో భారత కరెన్సీ విలువ కూడా ఎక్కువే. మరీ ముఖ్యంగా ఈ దేశం చాలా అందంగా ఉంటుంది. బీచ్ విహారయాత్రలను ఇష్టపడే జంటలకు ఈ ప్రదేశం సరైనది. ఇక్కడ విండ్ సర్ఫింగ్, కయాకింగ్, బోటింగ్ , వాటర్ స్కీయింగ్ ను ఆనందించవచ్చు.
వియత్నాం: గ్నేయాసియాలో అత్యంత అద్భుతమైన దేశాల్లో ఒకటి వియత్నాం. అతి తక్కువ బడ్జెట్ తో ఈ దేశాన్ని సందర్శించవచ్చు. ఈ దేశంలో భారతీయ రూపాయి విలువ దాదాపు 300 డాంగ్‌లు. స్వచ్ఛమైన బీచ్‌లు, సంస్కృతి, ప్రకృతి దృశ్యాలు, దట్టమైన అడవులు భారతతీయులతో సహా, విదేశాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. మొత్తంమీద ఈ దేశం హనీమూన్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇండోనేషియా: ఈ దేశం నవ దంపతుల హనీమూన్ కు బెస్ట్ ప్లేస్. పెళ్లయిన తర్వాత చాలా మంది జంటలు ఇండోనేషియాలోని బాలికి వెళ్తారు. ఇది చాలా ప్రశాంతమైన.. అందమైన ప్రదేశము. ఈ దేశానికి మీరు వెళ్లాలనుకుంటే అయ్యే ఖర్చు కూడా పెద్ద భారం అనిపించదు. దాదాపు 17 వేల దీవులతో కూడిన ఇండోనేషియా సాహస ప్రియులు ఇష్టపడే దేశం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..